Friday, May 17, 2024
- Advertisement -

దాగుడు మూత రాజ‌కీయాల‌కు తెర‌దించేదెప్పుడు…

- Advertisement -

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌హిరంగంగా కంటె ఎక్కువ‌గా ట్విట్ట‌ర్‌లోనె స్పందిస్తుంటారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందా.. లేకుంటే ఎంచుకున్న స్థానాల్లో మాత్రమే బరిలోకి దిగుతుందా .. లేక‌పోతె ఇత‌ర పార్టీల‌తో పొత్తు ఉంటుందా అనేది ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటి ఇవ్వ‌లేదు ప‌వ‌న్‌. ఎప్పుడు చూసినా ట్విట్ట‌ర్ ద్వారా స్పందించ‌డం త‌ప్ప మ‌రొక‌టిలేదు.

ఇప్పుడు తాజాగా జ‌న‌సేన పార్టీ ట్విట్ట‌ర్ అకౌంట్‌నుంచి సంచ‌ల‌న వార్త వెలువ‌డింది.మన బలం 175 ఉంటే 175 పోటీ చేద్దాం.. మన బలం ఎంతుంటే అంత.. 175 స్థానాలకు తెలంగాణ సహా అన్నిటికీ పోటీ చేస్తాం.. లేదా బలం లేదు మనం బలం ఎంతో అంతే చేస్తాం..” అని జనసేన పార్టీ ట్విట్టర్ లో ప్రకటించింది. దీన్ని బట్టి పోటీ చేసే స్థానాలపై జనసేన ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.పార్టీ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో వ‌చ్చిందంటె దానిలో నిజం లేక‌పోలేదు.

అయితే పోస్ట్ చేసిన కాసేపట్లోనే దాన్ని జనసేన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించేశారు. దీంతో ఆ పోస్టుపై ఆసక్తి మరింత పెరిగింది. ఆ పోస్టును అధికారికంగా పెట్టారా.. లేదా పొరపాటున పెట్టారా.. అనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో ర‌క‌ర‌కాల ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి.గ‌తంలో కూడా ఎన్నోసార్లు ట్విట్ట‌ర్ ద్వ‌రా స్పందించారు.

పవన్ కల్యాణ్ అంతర్గతంగా చేసిన చర్చల ద్వారానే ఈ కామెంట్స్ బయటికి వచ్చి ఉంటాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. లేకుంటే అధికారిక ఖాతాలో పోస్టు రాదని స్పష్టం చేస్తున్నాయి.ఇలా దాగుడు మూత‌లు ఎన్నిరోజుల అనే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఒక వైపు చంద్ర‌బాబుతో స‌న్నిహితంగా ఉంటూనె. అవ‌స‌రం అయితే జ‌గ‌న్ స‌హాయం తీసుకుంటామ‌ని ప‌వ‌న్ చెప్తుంటారు.

అయితే, తాము 175 స్థానాల్లోనే పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా వచ్చిన వార్తలు సరికాదనె వార్త‌లు వినిపిస్తున్నాయి.. అసలు జనసేన సీట్ల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇంకా ప్రత్యక్షంగా రంగంలోకే దిగలేదు.. అప్పుడే సీట్ల గురించి ఎలా మాట్లాడుతారనే వారు లేకపోలేదు. త‌ర్వ‌ర‌లోనె మొత్తం స‌మ‌యాన్ని రాజ‌కీయాల‌కు కేటాయిస్తాన‌ని ప్ర‌క‌టించారు..ట్విట్ట‌ర్‌ల‌ద్వారా ప్ర‌క‌ట‌న‌లు కాకుండా ప‌వ‌న్ పోటీ విష‌యంలో బ‌హిరంగంగా ప్ర‌క‌టించి గంద‌గోలం రాజ‌కీయాల‌కు తెర‌దించుతే బాగుంటుంద‌నేది రాజ‌కీయ వ‌ర్గాల భావ‌న‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -