Friday, May 17, 2024
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగ మేళ!

- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులకు శుభవార్త వినిపిస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ చక చక కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 65 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అధికారులు నివేదించారు. భర్తీ చేయాల్సిన వాటిలో అత్యధిక శాతం పోలీసు, విద్య, వైద్య ఆరోగ్య శాఖలోనే ఉన్నాయి.

పాఠశాల విద్యాశాఖలో 9,600 పోస్టులు ఖాళీగా ఉండగా, అందులో ప్రత్యేక గ్రేడ్ ఉపాధ్యాయులు (ఎస్‌జీటీ) 5,800, స్కూల్ అసిస్టెంట్‌లు 2,500, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఖ్య 300, మోడల్ పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులు వెయ్యి వరకు ఉన్నట్టు అధికారులు సీఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.

వివిధ శాఖల్లో 45 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, సంస్థల్లో 20 వేల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందని సీఎంకు తెలిపారు. ఇదిలా ఉంటే.. నాలుగో తరగతి ఉద్యోగుల వివరాలను మినహాయించి మిగతా వాటిని ఖాళీలుగా ప్రకటించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -