Sunday, May 19, 2024
- Advertisement -

ముందస్తుకు సిద్ధమవుతున్న కేసీఆర్.. అక్టోబరులో శాసనసభ రద్దు…?

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకొనే దిశ‌గా సాగుతున్నారు. దీనికోసం భారీ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో మంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మాని కాంగ్రెస్‌కు ఛాలెంజ్ చేసిన కేసీఆర్ ఆదిశ‌గా ఆలోచించ‌ట‌మే కాదు మ‌రో రెండ‌డుగులు ముందుకేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

కేసీఆర్ నిర్ణ‌యంతో తెలంగాణాలో ముంద‌స్తు ఎన్నిక‌లు రానున్నాయా…? అంటే అవున‌నే అనిపిస్తోంది ప‌రిస్థితులు చూస్తుంటే. నవంబరు, డిసెంబరులో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలతోపాటే తెలంగాణలోనూ ఎన్నికల నిర్వహణకు కేసీఆర్ పావులు కదుపుతున్న‌ట్లు స‌మాచారం. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ప్రధాని మోదీని కలిసిన సందర్భంగా ఈ విషయంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

పార్లమెంటులో వివిధ పార్టీల నేతల మధ్య నడుస్తున్న చర్చను ఒక కొలిక్కి తీసుకొస్తే.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికల సమయంలోనే.. తాము కూడా ఎన్నికలకు వెళితే భారీ ప్రయోజనం కలుగుతుందన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

భాజాపాకు ర‌హ‌స్య‌మిత్రుడిగా ఉన్న కేసీఆర్ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తోపాటు ఎన్నిక‌ల‌కు వెలితే ప్ర‌తికూల ప్ర‌భావాలు చూపే అవ‌కాశం వుంద‌ని ముంద‌స్తు ఎన్నిక‌ల‌కువెలితే అది త‌మ‌కు లాభిస్తుంని కేసీఆర్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే రాజకీయంగా తమకు కొన్ని సమస్యలు ఉంటాయని, కాంగ్రెస్ బలపడకముందే ఎన్నికలకు వెళ్లడం ద్వారా ప్రయోజనం ఉంటుందని మోదీతో కేసీఆర్ చెప్పారట.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తిగా సహకరిస్తామని మోదీకి మాట కూడా ఇచ్చారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రతిపాదనకు మోదీ సానుకూలంగా స్పందించినట్టు చెబుతున్నారు. దీంతో అక్టోబరులోనే శాసనసభను రద్దు చేయాలన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టు ఢిల్లీలో విస్తృత చర్చ జరుగుతోంది.

అసెంబ్లీ ఎన్నికలకు వేరుగా వెళితే తమ మద్దతు టీఆర్ఎస్ కు ఇస్తామని మజ్లిస్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే మాత్రం తమ మద్దతు కాంగ్రెస్ కు ఇస్తామని అసదుద్దీన్ ఓవైసీ తేల్చి చెప్పినట్లుగా చెబుతున్నారు. బీజేపీకి రహస్య మిత్రుడిగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ కు తాము మద్దతు ఇస్తే.. జాతీయ స్థాయిలో బద్నాం అవుతామని అసద్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. రానున్న కొద్ది రోజుల్లోనే అసెంబ్లీ రద్దుపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -