Sunday, May 19, 2024
- Advertisement -

ప‌శ్చిమ‌లో టీడీపీకి ఎదురుదెబ్బ‌….

- Advertisement -

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన నేత‌ల‌కు బాబు వ్య‌వ‌హారం ఇప్పుడిప్పుడే అవ‌గ‌త మ‌వుతోంది. త‌న దాకా వ‌స్తే గాని తెలియ‌ట్లేదు ఫిరాయింపు నేత‌ల‌కు. గ‌తంలో టీడీపీలోకి ఫిరాయించిన నేత‌లు ఇప్పుడు సొంత గూటికి చేరేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. పార్టీ మారే స‌మ‌యంలో బాబును పొగిడిన నేత‌లు… ఎన్నికల స‌మ‌యంలో బాబు మార్క్ రాజ‌కీయం బ‌య‌ట‌ప‌డింది. బాబు వాడ‌కం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసొచ్చింది ఫిరాయింపు నేత‌ల‌కు.

పారిశ్రామిక వేత్త ర‌ఘురామ కృష్ణంరాజు టీడీపీని వీడి మ‌ళ్లీ వైసీపీలోకి వ‌చ్చేందుకు సిద్దంగా ఉన్నారు. మొద‌ట వైసీపీలో ఉన్న ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో భాజాపా చేరారు. ఏడాదిన్న‌ర్ర క్రిత‌మే భాజాపాను వ‌దిలి బాబు అప‌రేష‌న్ ఆక‌ర్స్‌లో భాగంగా ప‌చ్చ కండువా క‌ప్పుకున్నారు. పార్టీలో చేరేట‌ప్పుడు న‌ర‌సరావు ఎంపీ టికెట్ ఇస్తాన‌ని బాబు హామీ ఇచ్చారు. అయితే చివ‌ర‌లో బాబు మొండిచేయి చూప‌డంతో పార్టీ మారేందుకు సిద్ద‌మ‌య్యారు.

కొద్దిరోజుల‌నుంచి వైసీపీలో చేరుతున్నార‌నే వార్త‌లు సోష‌య‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఆ వార్త‌ల‌పై రెండు రోజుల క్రితం స్పందించారు ర‌ఘురామ‌కృష్ణంరాజు. పార్టీలో చేరే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు క్లారిటీగా చెప్పారు… నేనే నరసాపురం టీడీపీ అభ్యర్థిని… ఇందులో ఎలాంటి అనుమానం లేదని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.

టీడీపీ త‌రుపున న‌ర‌సాపుం ఎంపీగా పోటీ చేసేందుకు అన్ని సిద్దం చేసుకున్న ఆయ‌న‌… ఏమైందో గాని ఇప్పుడు స‌డ‌న్‌గా వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యారు. ఇది టీడీపీకీ పెద్ద ఎదురు దెబ్బ త‌గ‌ల‌డంలో సందేహం లేదు. ఇప్ప‌టికే వైసీపీ నేత‌లతో సంప్ర‌దింపులు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. ఆయ‌న పార్టీలో చేరిన వెంట‌నే న‌ర‌సాపురం ఎంపీ టికెట్ కేటాయించేందుకు జ‌గ‌న్ సిద్దంగా ఉన్నారంట‌. దీంతో రెండు మూడు రోజుల్లో ర‌ఘ‌రామ కృష్ణం రాజు సొంత‌గూటికి చేరుకోనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -