Friday, April 26, 2024
- Advertisement -

కర్ణాటక మంత్రి శృంగార లీలలు.. సోషల్ మీడియాలో వైరల్!

- Advertisement -

ప్రజలకు వెన్ను దన్నుగా ఉంటూ.. వారి సంక్షేమం కోసం అహర్శిశలూ కృషి చేయాల్సిన ప్రజా ప్రతినిధి  ఓ యువతితో చనువుగా ఉన్న వీడియో కన్నడ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. కర్ణాటకలో ఓ మంత్రి రాసలీలల వీడియో కలకలం రేపుతోంది. ప్రజా ప్రతినిధిగా ప్రజలకు అండగా ఉండాల్సిన కర్ణాటక ఇరిగేషన్‌ మంత్రి రమేష్‌‌ జర్కిహోలి కి సంబంధించిన సెక్స్‌ స్కాండల్‌లో ఇరుక్కున్నాడు. సదరు యువతి డాక్యుమెంటరీ విషయమై కొన్ని రోజుల కిందట మంత్రి రమేశ్ వద్దకు వచ్చిందని, అయితే సదరు మంత్రి ఆ యువతిని లొంగదీసుకున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తాజాగా యువతితో మంత్రి ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో అవి కాస్తా వైరల్ గా మారి ముఖ్యమంత్రి ఎడ్యూరప్పకు కష్టాలు తెచ్చిపెట్టాయి. బెంగళూరులోని ఆర్‌టీ నగరలో నివాసం ఉండే ఒక యువతి రాష్ట్రంలోని డ్యాంలను డ్రోన్‌ కెమెరా ద్వారా చిత్రీకరించి డాక్యుమెంటరీ తీసేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రిని ఆశ్రయించింది. ఆ యువతి బలహీనతను క్యాష్ చేసుకొని ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికారట సదరు మంత్రి.

అలా పరిచయమై శారీరక సంబంధం వరకూ వెళ్లిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాను మోసపోయానని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులకు తెలిపింది. కానీ మంత్రి ఎదిరించేందుకు భయపడింది. కాగా, ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఒక యువతిని లోబర్చుకున్నారని పౌరహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేశ్‌ కల్లహళ్లి బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌ కమల్‌పంత్‌కు ఫిర్యాదు చేశారు.

అంతేకాదు, వీటికి సంబంధించి ఆడియోను, వీడియో సీడీని అందజేశారు. ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే.. నేను ఏ తప్పు చేయలేదు, రాజీనామా చేయాల్సిన పనిలేదని మంత్రి జార్కిహొళి అన్నారు.  ఆ రాసలీలల వీడియో తాను చూడలేదని, ఎవరో కుట్రలు చేస్తున్నారని మంత్రి రమేష్ అంటున్నారు.

‘చెక్’ మూవీ నితిన్ కి మైనస్ అయ్యిందా?

రోజూ పెరుగు తినడంతో ఎంతో ప్రయోజనం!

బంగారు ప్రియులకు శుభవార్త…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -