Wednesday, May 15, 2024
- Advertisement -

మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా చేయక తప్పదా…?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయ‌న చ‌ట్ట స భ‌ల‌కు ఎంపిక కాక‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం.మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మరణించడంతో ఆయన కుమారుడు శ్రవణ్‌ను ఏపీ సీఎం చంద్రబాబు కేబినెట్‌లోకి తీసుకున్నారు.

గతేడాది నవంబర్ 11న మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టినుంచి ఆరు నెలల్లోగా ఆయన శాసన సభ, శాసన మండలిలో ఏదో ఒకదానికి ఎన్నిక కావాల్సి ఉన్నప్పటికీ గడవులోగా ఆ పరిస్థితి లేకపోవడమే ఇందుకు కారణం. శ్రవణ్ ఇప్పటి వరకు ఏ చట్టసభకు ఎన్నిక కాలేదు. ఆరునెలల వ్యవధి ఈనెల 10వ తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాతి రోజు నుంచి ఆయన మంత్రిగా కొనసాగడానికి వీల్లేదు.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్‌లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి ప్రాతినిధ్యం వహించిన అరకు నుంచి టీడీపీ అభ్యర్థిగా శ్రావణ్‌ పోటీ చేశారు. కానీ ఈ ఎన్నికల ఫలితాలు ఈనెల 23వ తేదీన వెలువడనున్నాయి. ఈలోగానే ఆరు నెల గడువు ముగస్తుండడంతో ఆయన రాజీనామా అనివార్యమని భావిస్తున్నారు.ఇదే విషయాన్ని తెలియజేస్తూ గవర్నర్‌ కార్యాలయం మంత్రికి సమాచారం పంపినట్లు తెలిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -