Saturday, May 18, 2024
- Advertisement -

వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌కు సీటు క‌న్ఫ‌మ్ చేసిన జ‌గ‌న్‌

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ వ‌ల‌స‌ల‌తో వైసీపీ బ‌లోపేతం అవుతోంది. పాద‌యాత్ర‌లో వ‌స్తున్న ప్ర‌జాద‌ర‌న‌ను చూసి ముఖ్య‌నేత‌లు జ‌గ‌న్‌వైపు చూస్తున్నారు. ఇప్ప‌టికే అనేక మంది పార్టీ కండువా క‌ప్పునున్నారు. తాజాగా మ‌రో నేత‌ల వైసీపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధ‌మ‌య్యారు. కొన్ని రోజుల‌గా ఉవ‌స్తున్న ఊహాగానాల‌కు తెర‌దించుతూ రేపు జ‌గ‌న్ స‌మ‌క్షంలో చేర‌నున్నారు.

ఆయ‌న ఎవ‌రో కాదు మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన వసంత కృష్ణ ప్రసాద్ రేపు (గురువారం) వైసీపీ చీఫ్ జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. రేపు ఉదయం నందిగామ మండలం ఐతవరంలోని ఆయన ఇంటి నుంచి మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి కైకలూరులో జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు కృష్ణ ప్రసాద్ తెలిపారు.

టీడీపీలో తనకు సరైన ప్రాధాన్యం లభించడం లేదని గత కొంతకాలంగా కినుక వహించిన కృష్ణప్రసాద్ చివరికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 1999లో నందిగామ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ఓటమి పాలయ్యారు. 2014లో టీడీపీలో చేరిన ఆయన గుంటూరు-2 స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో టికెట్ లభించలేదు. త‌ర్వాత పార్టీలో స‌రైన ప్రాధాన్య‌త ద‌క్క‌క‌పోవ‌డంతో వైసీపీలో చేరాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

గతంలో ఒకటి రెండుసార్లు వైసీపీ చీఫ్ జగన్ నుంచి కృష్ణ ప్రసాద్‌కు ఆహ్వానం అందింది. దీంతో ఈనెల 10న ముహూర్తంగా నిర్ణయించారు. ఇక పార్టీలో చేరకముందే ఆయనకు టికెట్ ఖరారైందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మైలవరం అసెంబ్లీ, లేదంటే విజయవాడ నుంచి ఆయనను లోక్‌సభ బరిలో దింపాలని వైసీపీ భావిస్తున్న‌ట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -