నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మమత రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్‌కి వెళ్లి టీ కాచి అందరికీ అందించారు. ఆ తర్వాత అందరితో కలిసి తాను కూడా టీ తాగారు. మమత టీ కాచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను చుట్టేస్తోంది.
మమత గతంలోనూ పలుమార్లు టీ కాచారు. 2019లో బెంగాల్‌లోని దిఘాలోని టీ తయారుచేసి స్థానికులకు సర్వ్ చేశారు. కాగా, బెంగాల్‌లో ఎన్నికలు ఎనిమిది విడతల్లో జరగనున్నాయి. మొత్తంగా 33 రోజులపాటు ఎన్నికలు నిర్వహించనున్నారు. మమత పోటీ చేస్తున్న నందిగ్రామ్ నుంచి బీజేపీ నేత సువేందు అధికారి బరిలో ఉన్నారు.
మమత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆయన ఇటీవలే టీఎంసీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఒక రాష్ట్రంలో ఇన్ని విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తుండడం వెనక బీజేపీ నేతలు, ముఖ్యంగా ప్రధాని మోదీ కుట్ర ఉందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ పోరు రసవత్తరంగా మారింది. బెంగాల్‌లో ఎనిమిది విడతల్లో 33 రోజులపాటు ఎన్నికలు జరగనున్నాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ తో హృతిక్ రోషన్ ఫైట్ !
ఆగిపోయిన ‘ఆచార్య’ షూటింగ్.. కారణం అదేనా?
దేత్తడి హారికకు టూరిజం డిపార్ట్‌మెంట్ దిమ్మతిరిగే షాక్!