Saturday, April 20, 2024
- Advertisement -

మమత గూటికి చేరిన అభిజిత్​ముఖర్జీ..!

- Advertisement -

కాంగ్రెస్​ నేత, దివంగత రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ తనయుడు అభిజిత్​ ముఖర్జీ టీఎంసీలో చేరాడు. ఇవాళ సాయంత్రం కోల్ కతాలోని టీఎంసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.బెంగాల్​లో కాంగ్రెస్​కు భవిష్యత్​ లేదని భావించిన అభిజిత్​ ఈమేరకు నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఆయన ఇటీవల టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్​ బెనర్జీని కలుసుకొని పలు దఫాలుగా చర్చించారు. అంతేకాక ఇటీవల అభిజిత్​ వరసగా మమతా బెనర్జీకి మద్దతుగా ట్వీట్లు పెడుతున్నారు.

కరోనా వ్యాక్సినేషన్​ విషయంలో, మమతా బెనర్జీ తీసుకుంటున్న ఇతర నిర్ణయాల పట్ల ఆయన ఆమెకు మద్దతు పలికాడు. దీంతో ఆయన టీఎంసీలో చేరబోతున్నారన్న ఊహాగాలు వెల్లువెత్తాయి. అనుకున్నట్లుగానే ఈరోజు సాయంత్రం కోల్ కతాలో జరిగిన భారీ బహిరంగ సభలో అభిజిత్ ముఖర్జీ టీఎంసీ కండువా కప్పుకున్నారు.

పశ్చిమబెంగాల్ లో కాంగ్రెస్​కు ఇది పెద్ద దెబ్బ అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి బెంగాల్​లో పెద్దగా బలం లేదు. ఇలా వరసగా నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. అభిజిత్​ ముఖర్జీ.. 2012, 2014లలో జంగీపూర్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2019లో తృణమూల్‌ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

Also Read: బీజేపీకి సీన్​ రివర్స్​.. పార్టీ నుంచి ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు ?

టీఎంసీలో చేరిన సందర్భంగా అభిజిత్ ముఖర్జీ మాట్లాడుతూ బెంగాల్ లో బీజేపీ ప్రవేశాన్ని అడ్డుకున్న వారి నాయకత్వంలో పని చేయడం ఒక విశేష అధికారంగా తాను భావిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ మతతత్వ ప్రభంజనాన్ని మమతా బెనర్జీ ఎలా అదుపు చేయ గలిగారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా అందరి సహకారంతో దేశమంతా మతతత్వ వేవ్ ను మమత నియంత్రించ గలదని తాను నమ్ముతున్నట్లు అభిజిత్ ముఖర్జీ పేర్కొన్నారు.

Also Read: అన్నాడీఎంకేలో శశి ‘కలకలం’… చిన్నమ్మ పాచికలు పారతాయా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -