Thursday, May 2, 2024
- Advertisement -

ఆగిపోయిన ‘ఆచార్య’ షూటింగ్.. కారణం అదేనా?

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచేస్తున్నాయి. మార్చి మొదలైన నేపథ్యంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. తొమ్మిది గంటల నుంచి మొదలు 6 గంటల వరకు సూర్యుడు తన జోరు కొనసాగిస్తున్నాడు. దాంతో ప్రజలు ఉక్కపోత, ఎండవేడిమితో తల్లడిల్లిపోతున్నారు. ఇక వేసవి తాపాన్ని చల్లార్చుకోవడానికి చల్లని పానియాలు, కొబ్బరి బొండాలు, జ్యూస్ లు వెంట పడుతున్నారు. ఇక ఖమ్మం లో ఏ రేంజ్ లో ఎండలు కొడతాయో ప్రత్యేకంగ చెప్పనక్కరలేదు. కొత్తగూడెంలో అయితే రికార్డు స్థాయిలో ఎండలు కొడతాయి.

ఇక కొరటాల శివ దర్శకత్వంలోమెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ హీరోయిన్ గా ‘ఆచార్య’ తెరకెక్కిస్తుెన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఖమ్మంలో కూడా ఎండలు బాగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే అక్కడే షూటింగ్ చేస్తున్న ఆచార్య టీంకు కూడా సమ్మర్ సెగలు తగిలాయి. కొన్ని రోజులుగా ఇల్లందు గనుల్లో షూటింగ్ చేస్తున్నారు ఆచార్య టీం. మార్చ్ 15 వరకు అక్కడే షూటింగ్ ప్లాన్ చేసాడు కొరటాల శివ. అక్కడి బొగ్గు గనుల్లో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు కొరటాల.

అయితే మూడు రోజుల్లోనే అర్ధాంతరంగా ఈ చిత్ర షూటింగ్ ముగించారని తెలుస్తుంది. 7 రోజుల షెడ్యూల్ 3 రోజుల్లోనే ముగించేసారు చిత్ర యూనిట్. దాంతో అంతా షాక్ అవుతున్నారు. ఇల్లందు ఓపెన్ కాస్ట్ గనుల్లో కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆ కారణంగానే ఆచార్య షూటింగ్ కి ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తుంది.  ముఖ్యంగా చిరంజీవికి అధిక వేడితో డీహైడ్రేషన్ కు గురయ్యారని ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై దర్శక నిర్మాతలు ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది.. అసలు విషయం ఇంకా చిత్ర యూనిట్ తెలియజేయాల్సి ఉంది.

దేత్తడి హారికకు టూరిజం డిపార్ట్‌మెంట్ దిమ్మతిరిగే షాక్!

రణబీర్ కపూర్ కు కరోనా పాజిటివ్!

సొంత వారే.. రాజేంద్ర ప్రసాద్ ని ఆర్ధికంగా మోసం చేశారట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -