Thursday, May 16, 2024
- Advertisement -

మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్ సీపీకీ భాజాపా బిగ్ షాక్…

- Advertisement -

కర్నాటకలో ఆపరేషన్ కమలం ద్వారా కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణాన్ని కూల్చి అధికారంలోకి వచ్చింది. భాజాపా సీఎంగా యడ్యూరప్ప బాధ్యతలు స్వీకరించారు. త్వరలో మహారాష్ట్రలో జరగనున్న ఎన్నికల్లో మరో సారి అధికారంలోకి వచ్చేందుకు ఆపరేషన్ కమలంను ప్రారంభించారు. కాంగ్రెస్, ఎన్సీపీల్లో ఉన్న ముఖ్య నేతలను టార్గెట్ చేసింది. ప్రముఖ నేతలను పార్టీలో చేర్చుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

కొద్ది రోజుల క్రితం ఎన్ సీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర భాజాపా చీఫ్ చంద్రకాంత్ పాటిల్ స ంలో పార్టీలో చేరారు. తాజాగా ఎన్ సీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వైభవ్ పిచాడ్, మాజీ మంత్రి మధుకర్ పిచాడ్ కూడా కమలం గూటికి చేరుకున్నారు. మాజీ మంత్రి మధుకర్ పిచాడ్ ఎన్ సీపీ అధినేత శరద్ పవార్ కు అత్యంత సన్నిహితుడు. వీరితో పాటు శివేంద్ర రాజే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళిదాస్ కోలంక్ తదితరులు భాజాపా కండువా కప్పుకున్నారు. నవీ ముంబయ్ లో వీరికి మందచి పట్టుంది. కొత్తగా చేరే నాయకులకు పార్టీలో ప్రాముఖ్యత ఇస్తామని రాష్ట్ర భాజాపా చీఫ్ చంద్రకాంత్ పాటిల్ హీమీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో భాజాపా మహాజనదేశ్ యాత్ర పేరుతో యాత్ర ప్రారంభించనుంది. ఈ యాత్రలోనె ఇతర పార్టీలకు చెందిన నాయకులు భాజాపా గూటికి చేరనున్నారు. గత వారంలో ముంబయ్ ఎన్ సీపీ ఛీప్ సచిన్ అహిర్ శివసేనలో చేరారు. అక్టోబర్ లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -