Sunday, May 5, 2024
- Advertisement -

చంద్ర‌బాబు సీనియార్టీపై మోదీ క్లారిటీ

- Advertisement -

ఓ వైపు మోదీ గో బ్యాక్ అంటూ ఆందోళ‌న‌లు అంటూ మీడియాలో నిన్న‌టి నుంచి వ‌స్తున్న వార్త‌ల‌కు త‌న సెటైరిక్ స్పీచ్‌తో స‌మాధానం చెబుతూనే కాస్త అంద‌రిని అట్రాక్ట్ చేశారు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ. గుంటూరులో నిర్వ‌హించిన ప్ర‌జాచైత‌న్యస‌భ‌లో మాట్లాడిన న‌రేంద్ర‌మోదీ.. ఏపీ సీఎం చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శిల దాడి చేశారు.

అస‌లే మోదీ.. చెప్పాల‌నుకున్న విష‌యాన్ని ఆస‌క్తిక‌రంగా ప్ర‌జ‌ల్లోకి చొప్పించ‌డంలో దిట్ట‌. అలుపు లేకుండా.. విసుగు రాకుండా మాట్లాడ‌టంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. రోజు మిమ్మ‌ల్ని తిట్టందే చంద్ర‌బాబుకు రోజుగ‌డ‌వ‌టం లేద‌ని అప్‌డేట్స్ అందించారేమో బీజేపీ నేత‌లు… అంత‌కు మించి స‌మ‌యం, సంద‌ర్భం దొర‌క‌డంతో చంద్ర‌బాబును పొగడుతూనే… తెగడారు మోదీ. మాట్లాడితే 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అంటూ.. దేశంలో తానే సీనియ‌ర్ నేత‌ను అని ఎప్పుడూ చంద్రబాబు చెప్పుకునే డైలాగ్‌నే బేస్ లైన్‌గా తీసుకొని ర‌ఫ్పాడించారు మోదీ.

చంద్ర‌బాబే సీనిర‌య‌ర్‌.. సొంత మామను వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు సీనియరే. ఆ విషయంలో నేను ఏమాత్రం చంద్రబాబుకు సరి తూగలేను. మిత్రపక్షాలను మార్చడంలో… పార్టీల ఫిరాయింపుల్లో.. ఒక ఎన్నిక తర్వాత మరో ఎన్నికల్లో ఓడిపోవడంలోప‌.. ఇలా ప్ర‌తి అంశంలో చంద్ర‌బాబే సీనియ‌ర్… ఈ రోజు ఓ రాజకీయ పార్టీని తిట్టి రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో కూడా చంద్రబాబు సీనియర్ అంటూ మోదీ విమ‌ర్శ‌లు చేశారు.

అక్క‌డితో ఆగ‌లేదు ఎన్టీఆర్ కుర్చీని అందుకున్న చంద్రబాబు… ఆయన కలలను నిజం చేస్తానని చెప్పాడా? లేదా? ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారా? లేదా? కానీ ఈరోజు ఎన్టీఆర్ మాటలకు గౌరవం ఇస్తున్నారా? ఈ విషయం సామాన్యులకు కూడా అర్థం అవుతోంది. కానీ చంద్రబాబు లాంటి సీనియర్ లీడర్లకు ఎందుకు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ అణచివేత అహంకారం నచ్చకే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి… కాంగ్రెస్ ముక్త ఏపీని చేయాలని నిర్ణయించుకున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నారు? అంటూ మాట‌ల దాడి చేశారు.

మోదీ మాట‌లు సెటైరిక్‌గా ఉన్న.. ఆ మాట‌లు వింటే ఔను నిజ‌మే క‌దా? అనిపిస్తుంది సామాన్య ప్ర‌జానికానికి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -