కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అధికారం చేతిలో ఉంది కదా అని…. లేకపోతే అధికారంలో ఉన్నవాళ్ళ సపోర్ట్ ఉంది కదా అని అక్రమ పద్దతుల్లో ప్రత్యర్థులను అణచివేయడానికి కుట్రలు పన్నితే అంతిమ విజయం దక్కిందని ఆనందపడడానికి ఏమీ లేదు. కాలం గడిచే కొద్దీ పరిస్థితులు పూర్తిగా రివర్స్ కూడా కావొచ్చు. ఇప్పుడు చంద్రబాబుకు కూడా అదే మ్యూజిక్ స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. జగన్ ప్రజాబలాన్ని డైరెక్ట్‌గా ఎదుర్కోలేక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చంద్రబాబు చీకటి రాజకీయాలు చేశాడన్నది నిజం. ఇదే విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా చిదంబరం బయటపెట్టాడు. రాష్ట్ర విభజన వరకూ కూడా పూర్తిగా సోనియాతో కలిసి రాజకీయం చేశాడు చంద్రబాబు. జగన్‌పై కేసులు పెట్టించాడు. జగన్‌ని అణగదొక్కడానికి ఎన్ని చేయాలో అన్నీ చేశాడు. సోనియాను ఢీ కొట్టడం వళ్ళే జగన్‌పై కేసులు అని ఈ మధ్యే చంద్రబాబు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత 2014 ఎన్నికల సమయానికి మోడీ క్రేజ్ చూసిన చంద్రబాబు బిజెపితో పొత్తుకు జై అన్నాడు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ కూడా ఈడీతో సన్నిహిత సంబంధాలు నెరిపి జగన్‌ని తీవ్రస్థాయిలో ఇబ్బందిపెట్టడానికి ప్రయత్నాలు చేశాడు.
అయితే ఇప్పుడు టెర్మ్స్ పూర్తిగా మారిపోయాయి. నాలుగేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ చిప్ప చూపిస్తున్నప్పటికీ మోడీతో సంబంధాలను చంద్రబాబు తెంచుకోకపోవడానికి ప్రధాన కారణం కేసుల వ్యవహరాలే. ఒక కారణం తనపైన ఉన్న కేసులను మోడీ ఎక్కడ బయటికి తీస్తాడో…… తననెక్కడ జైలుకు పంపిస్తాడో అని. అంతకుమించిన కారణం ఏంటంటే రాజకీయ కక్ష్యతో జగన్‌పై పెట్టించిన కేసులను మోడీ ఎక్కడ కొట్టేయిస్తాడో అని. లేకపోతే అధికారంలో ఉన్న పార్టీతో లాలూచీ పడి వ్యవస్థలను మేనేజ్ చేస్తే తప్ప జగన్‌పైన కేసులు నిలబడని పరిస్థితి. జేడీ లక్ష్మీనారాయణ ఉన్నంత కాలమే జగన్‌పై కేసుల విషయంలో చాలా దూకుడు కనిపించింది. జేడీ లక్ష్మీనారాయణకు ఒక వర్గంతో ఉన్న పరిచయాల గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు. మొత్తంగా చూస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలతో చంద్రబాబుకు సత్సంబంధాలు ఉంటే తప్ప జగన్ కేసుల విషయంలో జగన్ ఇబ్బందిపడే పరిస్థితి అస్సలు ఉండదన్నది న్యాయకోవిదులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ మాటలే నిజమవుతున్నాయి. ఈడీతో చంద్రబాబు సంబంధాల గురించి గతంలో జగన్ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ఉన్న విషయం తెలిసిందే. కానీ అప్పట్లో మోడీతో బాబుకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు వైదొలిగిన నేపథ్యంలో ఈడీ నుంచి ఫస్ట్ షాక్ చంద్రబాబుకి తగిలినట్టే కనిపిస్తోంది. చంద్రబాబు ఆధిపత్యం లేకుండా పోయిన నేపథ్యంలో గతంలో అటాచ్ చేసిన జగన్ ఆస్తుల కేసులో ఈడీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. జగతి ఆస్తులను అటాచ్ చేయడాన్ని అప్పిలేట్ ట్రిబ్యునల్ తప్పు పట్టింది. ఇక ముందు కూడా ఇలాంటి తీర్పులు చాలానే రాబోతున్నాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మోడీతో జగన్ కుమ్మక్కయ్యాడని చంద్రబాబు అండ్ బ్యాచ్ ఆరోపణలు చేయడం ఖాయం. కానీ పూర్తిగా రాజకీయ కక్ష్యలతో పెట్టిన జగన్ ఆస్తుల కేసు నిలబడాలంటేనే వ్యవస్థలను మేనేజ్ చేయాల్సి ఉంటుందని…..సోనియా జమానా నుంచీ ఇప్పటి వరకూ చంద్రబాబు చేసింది అదేనని…..అయితే ఇప్పుడు వ్యవస్థలను మేనేజ్ చేసే అవకాశం ఇకపై చంద్రబాబుకు ఉండే అవకాశం లేదని..అందుకే జగన్ కేసులన్నీ కూడా ఇకపై కోర్టుల్లో నిలబడే అవకాశమే లేదని న్యాయనిపుణులు చెప్తున్నారు. ఆ రకంగా ముందు ముందు చంద్రబాబుకు చాలా పెద్ద షాకులే తగుల్తాయని……వ్యవస్థలనూ ఎవరూ మేనేజ్ చేయకపోతే……రాజకీయ జోక్యం లేకపోతే మాత్రం జగన్ కేసులు అస్సలు నిలబడే అవకాశమే లేదని సీనియర్ మోస్ట్ బ్యూరోక్రాట్స్ అభిప్రాయపడుతుండడం గమనార్హం. మొత్తానికి చంద్రబాబుకు షాకులు…. వైకాపా శ్రేణులకు బూస్టింగులు మొదలైనట్టేనన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
