- Advertisement -

భర్తపై ఫిర్యాదుకు వస్తే వివాహితను లోబరుచుకున్న ఎస్ఐ!

- Advertisement -

రక్షణ కల్పించాల్సిన రక్షకుడే భక్షకుడిగా మారాడు. భర్త వేధింపులపై న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన ఒక వివాహితకు అండగా ఉంటానని నమ్మించి.. ఆపై ఆమెను లోబరుచుకుని దారుణానికి ఒడిగట్టిన సంచలన ఉదంతం హన్మకొండ (Hanamkonda) జిల్లాలో వెలుగుచూసింది. విడాకులు ఇప్పించి పెళ్లి చేసుకుంటానని ఐదేళ్లుగా శారీరకంగా వాడుకుంటూ.. గర్భవతిని చేసి, ఆపై బలవంతంగా అబార్షన్ చేయించిన సదరు సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హన్మకొండ పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల రికార్డుల ప్రకారం.. గతంలో హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన గోదారి రాజ్‌కుమార్ (Godari Rajkumar) వద్దకు సదరు వివాహిత తన భర్తతో ఉన్న కుటుంబ గొడవలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఆ సమయంలో బాధితురాలిని గమనించిన ఎస్ఐ రాజ్‌కుమార్.. ఆమెపై కన్నేశాడు. నీ భర్త నుండి నీకు విడాకులు ఇప్పిస్తానని, ఆ తర్వాత తానే నిన్ను అధికారికంగా పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. తనకు కొడుకు లేడని, తన కోరిక తీర్చాలంటూ నమ్మించి ఆమెతో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో వివాహితను పలుమార్లు గర్భవతిని కూడా చేశాడు.

అయితే ఇటీవల సదరు వివాహిత మళ్లీ గర్భం దాల్చడంతో.. ఎస్ఐ రాజ్‌కుమార్ ఆమెకు బలవంతంగా అబార్షన్ (గర్భస్రావం) మాత్రలు ఇచ్చి మింగించాడు. ఆ మాత్రలు వాడటంతో బాధితురాలికి విపరీతమైన రక్తస్రావమై తీవ్ర అనారోగ్యానికి గురైంది. తన ఆరోగ్యం పాడవ్వడంతో ఇకనైనా తనను పెళ్లి చేసుకోమని ఆమె ఎస్ఐ రాజ్‌కుమార్‌ను నిలదీసింది. దానికి సదరు ఎస్ఐ అసలు రంగు బయటపెట్టాడు. పెళ్లి చేసుకోమని అడిగితే గతంలో దిగిన పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో బయటపెడతానంటూ బాధితురాలిని దారుణంగా బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.

ఇంతటితో ఆగకుండా.. “నన్ను గనుక ఇబ్బంది పెట్టాలని చూస్తే.. ఇదే పోలీస్ శాఖలో ఉన్న నా తమ్ముడు రవికుమార్ నీ అంతు చూస్తాడు.” అంటూ సదరు ఎస్ఐ రాజ్‌కుమార్ ఆమెను తీవ్రంగా బెదిరించాడు. కట్టుకున్న భర్త కాకుండా, రక్షణ ఇస్తాడనుకున్న పోలీస్ ఆఫీసర్ కూడా నమ్మించి గొంతు కోయడంతో బాధితురాలు తీవ్ర మనస్తాపానికి గురైంది. లోకల్ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. ఆమె నేరుగా ఉన్నతాధికారి అయిన ఐజీ (IG) ని ఆశ్రయించి తన బాధను విన్నవించుకుంది. ఐజీ కఠిన ఆదేశాల మేరకు హన్మకొండ పోలీసులు నిందితుడైన ఎస్ఐ గోదారి రాజ్‌కుమార్‌పై అత్యాచారం, బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్ కింద కేసులు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -