Sunday, May 19, 2024
- Advertisement -

అంద‌ర్నీ పిలిచారు.. కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ ఏమైందీ ప‌వ‌న్‌?

- Advertisement -

జేఎఫ్‌సీపై ఎవ‌రికీ క్లారిటీ లేదే..

కేంద్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఇచ్చిన విభజన హామీలపై పోరాటం చేస్తున్న అని ప్ర‌క‌టించిన మాజీ న‌టుడు, జ‌నసేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆ మేర‌కు పోరాటం చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఏదో గడువు.. ఎవ‌రికి విధించాడో కూడా తెలియ‌దు. అలాంటి వ్య‌క్తి ఆ గ‌డువు దాటిపోయింద‌ని చెబుతూ కొత్త వేదిక‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అదే జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ (జేఎఫ్‌సీ) ఏర్పాటు చేశాడు. మొద‌ట జేఏసీ అన్నాడు.. ఆ త‌ర్వాత ఏమైందో లేదో జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ అని చెప్పాడు. దీని ద్వారా ఏం ఫైండ్ చేస్తారో చూడాలి.

అయితే జేఎఫ్‌సీ ఆధ్వర్యంలో ఏర్పాటైన నిజనిర్ధాణ కమిటీ శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 16) హైద‌రాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, సీనియర్ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్, సీపీఎం ఏపీ కార్యదర్శి మధు, సీపీఐ ఏపీ కార్యాదర్శి రామకృష్ణతో పాటు ఆర్థిక నిపుణులు, మేధావులు హాజరయ్యారు. సమావేశానికి అన్ని పార్టీలను ఆహ్వానించామని చెప్పిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మ‌రీ వారెందుకు రాలేదు అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

దీనికివాళ్లు చెబుతున్న మాటేమిటంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, వైఎస్సార్‌సీపీకి సొంత ఏజెండా ఉంద‌ని అందుకే మీటింగ్‌కు రాలేదని క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వచ్చిన నిధులపై టీడీపీ, బీజేపీ నేతలు లెక్కలు చెప్పడం లేదని ప‌వ‌న్ మ‌రో కొత్త డ్రామాకు తెర తీశాడు. ఇంత‌కు ప‌వ‌న్ ఏం చేయాల‌నుకుంటున్నాడో.. దేనికోసం జేఎఫ్‌సీ ఏర్పాటు చేశాడో అత‌డికి క‌న్నా తెలుసో లేదో.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -