Friday, May 17, 2024
- Advertisement -

బీజేపీ తో తెంచుకునే ఆలోచనలో పవన్ కళ్యాణ్..?

- Advertisement -

పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండాలా, లేదా పూర్తి స్థాయి సినిమాల్లో ఉండాలా అనేది అర్థం కావట్లేదు.. ఎటువైపున్నా అభిమానులు అయన వెంట ఉంటారని నిజమే అయినా రాజకీయాల్లో ఎక్కువకాలం ఉండాలంటే తప్పకుండా అధికారంలోకి ఒక్కసారైనా రావాలి లేదంటే ప్రజలు మర్చిపోయే ప్రమాదం లేదా అధికారం పార్టీ చేతుల్లో ఉండే ప్రమాదం ఉంటుంది కాబట్టి జనసేన కి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం అనివార్యం అయింది.. వాస్తవానికి 2014 లోనే జనసేన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినా అప్పుడు పోటీ చేయడానికి ఛాన్స్ రాలేదు.. దాంతో 2019 దాకా వేచి చూడాల్సిన పరిస్థితి.. ఇప్పుడు ఒక్క సీటు తో ఉంది ఏమీ చేయలేని పరిస్థితి..

వచ్చే ఎన్నికలనాటికైనా కనీసం తన సీట్లు గెలుచుకుని అసెంబ్లీ కి అడుగుపెట్టాలని అయన అభిమానులు కోరుకుంటున్నారు.. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బీజేపీ తో పొత్తు పెట్టుకుని ప్రజల తరపున ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే బీజేపీ తో కలిసి కొన్ని కార్యక్రమాలలో పనిచేసిన పవన్ కళ్యాణ్ అమరావతి విషయంలో మాత్రం ఇద్దరికీ పడట్లేదని చెప్పొచ్చు.. మా పొత్తు ఎప్పటికీ ప‌దిలం అంటూ.. అటు ప‌వ‌న్‌, ఇటు బీజేపీ రాష్ట్ర చీఫ్‌.. సోము వీర్రాజులు సంయుక్తంగా ప్రక‌టించారు. కానీ, క్షేత్రస్థాయిలో ఈ పొత్తును ప్రామాణికంగా తీసుకుని ఇరు పార్టీలు అడుగులు వేస్తున్న ప‌రిస్థితి అయితే క‌నిపించ‌డం లేదు.

రాజ‌ధాని విష‌యంలో బీజేపీ స్టాండు వేరేగా ఉంది. ప‌వ‌న్ స్టాండ్ వేరేగా ఉంది. పవన్ కళ్యాణ్ అమరావతి కి సపోర్ట్ చేస్తుంటే బీజేపీ మాత్రం ఏది రాజధాని అయినా పర్వాలేదన్నట్లు వ్యవహరిస్తోంది. అయినా కూడా ఇప్పటి వ‌ర‌కు ఇరు పార్టీల నాయ‌కులు క‌లిసే ఉన్నారు. రాజ‌ధాని విష‌యంలో నిర్ణయం రాష్ట్రానిదేన‌ని చెబుతున్న బీజేపీ.. ఒక రాజ‌ధాని కావాలా ? మూడు రాజ‌ధానులు ఉండాలా ? అనే విష‌యంలోనూ మౌనం పాటిస్తోంది. దీనిపై బీజేపీ ఎలాంటి నిర్ణయ‌మూ తీసుకోలేదు. అయితే, ఇప్పుడు ఈ పార్టీ మిత్రప‌క్షంగా ఉన్న జ‌న‌సేన మాత్రం అమ‌రావ‌తికే జైకొట్టింది. మూడు వ‌ద్దని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఏకైక రాజ‌ధాని వ‌ల్లే రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగుతుంద‌ని కుండ‌బ‌ద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో త్వరలో వీరి పొత్తు పోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీ ఒకే మాట మీద ఎలా నిలబడతాయి చూడాలి.. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -