Sunday, April 28, 2024
- Advertisement -

ఎన్నికల బరిలో జూ.ఎన్టీఆర్.. చంద్రబాబు వ్యూహం అదే !

- Advertisement -

ఏపీలో ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రణాళికలు ఒక రీతిలో ఉంటే.. టీడీపీ, జనసేన పార్టీల ప్రణాళికలు మరో రీతిలో ఉన్నాయి. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో విజయపై మూడు పార్టీలు కూడా గట్టిగానే గురిపెట్టాయి. కాగా వైసీపీ, జనసేన పార్టీలతో పోలిస్తే ఈసారి ఎన్నికలు టీడీపీకి అత్యంత కీలకం అనే చెప్పాలి. గత ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసిన పార్టీ.. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటలని దృఢ సంకల్పంతో ఉంది. అందువల్ల ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళుతూనే ప్రజల ధృష్టి టీడీపీపై పడేలా చూస్తున్నారు అధినేత చంద్రబాబు నాయుడు. .

ఇక ఎవరు ఊహించని విధంగా ఇవే తన చివరి ఎన్నికలంటూ ఒక్కసారిగా పోలిటికల్ హిట్ పెంచారు చంద్రబాబు. నలబై ఏళ్ల సుధీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపార చాణక్యుడిగా పేరు గాంచిన బాబు..చివరి ఎన్నికలు అనడంతో ప్రజల్లో కూడా ఈ అంశంపై గట్టిగానే చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను ఆకర్షించారు జగన్.. అదే విధంగా చంద్రబాబు చివరి ఛాన్స్ అంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాలంటే చంద్రబాబు అనుసరిస్తున్న చివరి ఛాన్స్ వ్యూహం ఒక్కటే సరిపోదు.. టీడీపీని గ్రౌండ్ లెవెల్ లో సమన్వయ పరుస్తూ.. నేతల్లోనూ, కార్యకర్తల్లోనూ జోష్ నింపుతూ ప్రజల దృష్టిని ఆకర్షిచాలంటే టీడీపీ అంతకుమించి ప్రచారం చేయాలి. దాంతో చంద్రబాబు ముందు ఉన్న ఒకే ఒక్క మార్గం జూ. ఎన్టీఆర్ ను ప్రచారం కోసం ఎన్నికల బరిలో దింపడం.

జూ. ఎన్టీఆర్ వాక్చాతుర్యం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున జూ. ఎన్టీఆర్ చేసిన ప్రచారం.. పార్టీని అధికారంలోకి తీసుకురాకపోయిన ప్రజలను మాత్రం విపరీతంగా ఆకర్షించింది. ఇక ఆ తరువాత నుంచి టీడీపీలో చెలరేగిన అంతర్మదనం వల్ల జూ. ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఏపీ టీడీపీ పరిస్థితి దారుణంగా ఉందనే చెప్పాలి. అందువల్ల వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉన్న టీడీపీకి జూ. ఎన్టీఆర్ అవసరత ఎంతైనా ఉంది. అందుకే చంద్రబాబు కూడా జూనియర్ ను ప్రచారం కోసం ఎన్నికల బరిలోకి దించేందుకు సుద్దమతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే విషయాన్ని ఇటీవల నందమూరి తారకరత్న కూడా కన్ఫర్మ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చెబుతూ.. జూ. ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారని వస్తారని చెప్పుకొచ్చారు. దీంతో మరోసారి జూ. ఎన్టీఆర్ కు సంబంధించిన చర్చ జోరుగా జరుగుతోంది. మరి జూ. ఎన్టీఆర్ ప్రచారానికి సిద్దంగా ఉన్నారా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

వన్స్ మోర్ జగన్.. 2024 ?

ఏపీలో బి‌ఆర్‌ఎస్ .. ఎవరికి ముప్పు ?

పవన్ కోసం బాబు కాంప్రమైజ్ కావాల్సిందే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -