Saturday, May 18, 2024
- Advertisement -

సెంటీమెంట్ అఖిల‌ను గ‌ట్టెక్కిస్తుందా…?

- Advertisement -

మంత్రి అఖిల ప్రియకి నంద్యాల ఉపఎన్నిక కంటి మీద కునుకు లేకుండాపోతోంది. ఓడితే ఆమెకు రాజకీయంగా కష్టాలు తప్పవు. తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత జ‌ర‌గుతున్న ఉప ఎన్నిక‌కావ‌డంతో అఖిల‌పై ఒత్తిడి హైరేంజ్‌లో ఉంది. బ్రహ్మానందరెడ్డి అయినా, గెలుపు బాధ్యత పూర్తిగా అఖిలప్రియ మీదనే పడింది

రాజకీయంగా ఇంకా ఓనమాలు నేర్చుకుంటోన్న టైమ్‌లోనే, అనూహ్యంగా అఖిలప్రియకి మంత్రిపదవి దక్కింది. నిజానికి అఖిలప్రియ రాజకీయాల్లో రావడమే అనూహ్యం. తల్లి మరణంతో ఎమ్మెల్యే పదవి, తండ్రి మరణంతో మంత్రిపదవి.. ఈ రెండూ ఆమె జీవితంలో అనుకోని, అతి ముఖ్యమైన సంఘటనలుగా చెప్పుకోవచ్చు.

టీడీపీకి మంచి ప‌ట్టున్న శిల్పా బ్ర‌ద‌ర్స్ వైసీపీలోకి వెల్లడంతో అఖిల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా త‌యార‌య్యింది.’మా నాన్నని రాజకీయంగా ఇబ్బంది పెట్టారు.. మానసిక క్షోభకి గురిచేశారు..’ అంటూ అఖిలప్రియ కంటతడి పెడ్తున్న తీరు శోచనీయం. దానికితోడు ఎన్నికల సమయంలో తన తల్లి శోభా నాగిరెడ్డి జగన్‌ సోదరి షర్మిల కోసం వెళ్ళి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారంటూ కొత్త వాదన తీసుకురావడం రాజకీయంగా ఆమె అపరిపక్వతను చెప్పకనే చెప్పేస్తోంది.

మామూలుగా అయితే అధికార పార్టీకి నంద్యాల ఉప ఎన్నికల్లో తిరుగుండకూడదు. కానీ, ఈక్వేషన్స్‌ అనూహ్యంగా మారిపోయాయిప్పుడు. ముందు ముందు కూడా టీడీపీకి పరిస్థితులు వెక్కిరించేలానే కన్పిస్తోంది వ్యవహారం. ఆ ఆందోళన అంతా మంత్రి అఖిలప్రియలోనే స్పష్టంగా కన్పిస్తోంది.

తల్లిదండ్రుల్ని కోల్పోయిన అనాధని..’ అంటూ కంటతడి పెట్టడం ద్వారా, లబ్ది పొందాలనుకుంటున్న అఖిలప్రియకి, వైఎస్సార్సీపీ శ్రేణులు గట్టిగానే చెక్‌ పెడుతున్నాయి. ‘దమ్ముంటే మంత్రిపదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలువ్‌..’ అని వైఎస్సార్సీపీ నుంచి వస్తున్న సవాల్‌కి సమాధానం చెప్పే పరిస్థితుల్లో కూడా అఖిల ప్రియ లేకపోవడం గమనార్హమిక్కడ.

రాజకీయం అంటే ఇలా వుంటుందా.? ఎన్నికల్ని ఎదుర్కోవడం ఇంత కష్టమా.? ప‌్ర‌త్య‌ర్థిని ఎదుర్కొవాలంటె త‌గిన చాక‌చ‌క్యం,మాట‌కారి త‌నం అవ‌స‌రం.అందులోను సొంత‌పార్టీలో ఉన్న అసంతృప్తుల‌ను రాజ‌కీయంగా ఎదుర్కొవాలి. అన్న విషయం ఇప్పుడిప్పుడే అఖిల ప్రియకి తెలిసొస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -