Saturday, May 18, 2024
- Advertisement -

మన సీఎం లు ఆ ముఖ్యమంత్రికి మొండి చెయ్యి చూపుతారా..!!

- Advertisement -

దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల స్నేహ బంధం గురించి అందరికి తెలిసిందే.. ఒకప్పుడు ఒకే రాష్ట్రంగా మెదిలిన ఈ మూడు రాష్ట్రాలు కాలక్రమేణా విభజించబడి మూడు రాష్ట్రాలుగా వెలిశాయి.. విడిపోయినా కూడా ఈ మూడు రాష్ట్రాల నాయకులూ, ప్రజలు కలిసిమెలసి ఉంటున్నారు.. ఇక రాజకీయ నాయకులైతే ఒకటి కార్యక్రమాలకి ఒకరు హాజరవుతూ తమ ప్రేమను చాటుకున్నారు.. అలా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా మొట్టమొదటిసారిగా ప్రమాణం స్వీకారం చేసిన జగన్ సీఎం ఫంక్షన్ కి అటు తెలంగాణ సీఎం కేసీఆర్, ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ లు హాజరయ్యారు..

దక్షిణాదిన ఎలాంటి సమస్య వచ్చినా కలిసికట్టుగా పోరాడతామని ప్రజలకు మాట ఇచ్చారు కూడా.. అయితే ఇప్పటివరకు అలాంటి సమస్య మూడు రాష్ట్రాలకు రాలేదు.. కానీ ఇప్పుడు స్టాలిన్ నీట్ – జేఈఈ పరీక్ష ని జాతీయాంశం గా మలచాలని చూస్తున్నారు.. దానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహకారం ఇటీవలే కోరారు కూడా.. ఇటీవలే నీట్ – జేఈఈ పరీక్ష ని నిర్వహించాలని కేంద్రంలోని బీజేపీ నిర్ణయించింది… దానికి స్టాలిన్ ససేమీరా ఒప్పుకోవడం లేదు. సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులైన జగన్, కేసీఆర్‌లను ఇందుకు కలిసి రావలని పిలుపునిచ్చారు.

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇలా పరీక్షలు నిర్వహించడంపై ఆయన ధ్వజమెత్తారు.. నీట్-జేఈఈ నిర్వహణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలపాలని విపక్షాలు నిర్ణయించాయి. ఈ బృందంలో… కేసీఆర్, జగన్ చేరుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నీటి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు పొసగడం లేదు, పైగా తమకు సన్నిహితంగా ఉండే బీజేపీ తో కయ్యానికి దిగడం అంత మంచిది కాదని వారి అభిప్రాయం.. ఈ తరుణంలో స్టాలిన్ పిలుపు న వారు ఏవిధంగా తిరస్కరిస్తారనేదే అసలు విషయం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -