Thursday, May 16, 2024
- Advertisement -

ఎంత భయపెట్టాలని చూస్తే అంత బలపడతాడు

- Advertisement -

ఓటుకు కోట్లు కేసులో మళ్లీ ఫైళ్లు కదులుతున్నాయి. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిలో ఈడీ సోదాలు జరిగాయి. ఆ సోదాలు కేవలం కేసీఆర్ చేయించినవే. రేవంత్ రెడ్డి మీద భయంతో పాత కేసును తిరగతోడి ఈడీని ఉసిగొల్పారని కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అయితే కేసీఆర్ చెప్పినంత మాత్రాన ఈడీ, ఐటీ రంగంలోకి దిగవు కనుక కేసీఆర్ కోరిక మేరకు బీజేపీ సహాయసహాకారాలు, ఆదేశాలతోనే ఈడీ రంగంలోకి దిగిందని ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఆధరణ పెరుగుతుండటం వల్లే భయపడి టీఆర్ఎస్, బీజేపీ ఇలా చేస్తున్నాయనంటున్నారు. మరోవైపు ఇప్పటికే 20 ఏళ్ల క్రితం నాటి కేసును తవ్వి తీశారని చెబుతున్నారు. జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు పేరుతో నడుస్తున్న కేసును ఇప్పుడు మళ్లీ ఎన్నికల ముందు తవ్వి తీసి, రేవంత్ రెడ్డిని ఇరికిద్దామని కేసీఆర్, కేటీఆర్ చూస్తున్నారని మండిపడుతున్నారు. ఆ కేసును సాకుగా చూపి రేవంత్ రెడ్డిని దారిలోకి తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్‌ ఇలాంటి పిచ్చిపనులు చేస్తున్నారని ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రాజకీయకక్షలతో రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ తనిఖీలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న జగ్గారెడ్డి, నేడు రేవంత్ రెడ్డి రేపు ఇంకోనేత, ఇలా ప్రతిపక్షాలను పాత కేసులతో దారిలోకి తెచ్చుకోవాలని, కాంగ్రెస్, టీడీపీ నేతలను అణగదొక్కాలని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఉత్తమ ధ్వజమెత్తారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదన్నారు.

కానీ టీఆర్ఎస్ నాయకులు ఎన్ని కేసులు పెడితే రేవంత్ రెడ్డికి అంత మేలు చేసినట్టే. ఐటీ, ఈడీ దాడులతో ఆయనకు పోయేదేం లేదు. ఈ టైంలో అవి రంగంలోకి దిగాయంటే కేవలం రాజకీయ కక్షలతోనే వేధింపులకు పాల్పడుతున్నారని ఇప్పటికే ప్రజల్లోకి చర్చ వెళ్లపోయింది. దానికి తోడు తనపైన ఈగ వాలినా అది టీఆర్ఎస్ భవన్ నుంచి వచ్చిన ఈగే. ఆ ఈగ మామూలు ఈగ కాదు. పక్కా విషపూరితం, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత కలిసి ఆ ఈగకు విషం ఎక్కించి, నాపై వాలాలని పంపించారు.. ఈగ సినిమా చూశాక రాజమౌళితో మాట్లాడి మరీ ఇలాంటి కుట్రలు నాపై చేస్తున్నారంటూ మాటలగారడీతో ఇరకాటంలో పెట్టగల సమర్ధుడు రేవంత్ రెడ్డి. సో ఎన్నికల సమయంలో ఐటీ, ఈడీ దాడులు, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కేసులు, ఓటుకు నోటు కేసులు, ఇలా ఎన్ని కేసులు పెడితే అంత లాభం రేవంత్ రెడ్డికి. తనపై ఉన్న ప్రతి కేసును, దర్యాప్తును చాకచక్యంగా, సానుభూతితో ఓట్లుగా మార్చుకోగల నేర్పు కలిగినవాడు. పైగా ఇప్పుడు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో ఉన్నాడు. ఢిల్లీ స్థాయిలో ఆ పార్టీ నేతలతో మంచి సంబంధాలే నెరుపుతున్నాడు. కనుక టీఆర్ఎస్ అతడిపై ఎన్ని కేసులు, దాడులు, సోదాలు, తనీఖలు అంటూ భయపెట్టాలని చూస్తే, రేవంత్ అంత బలపడతాడు. అందులో అనుమానమే అక్కర్లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -