Wednesday, May 15, 2024
- Advertisement -

సుబ్బిరామిరెడ్డి కూడా వైసీపీలోకి..?

- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో న‌మ్మ‌కంగా ఉండే నాయకుడంటే వెంటనే చెప్పే పేరు సుబ్బిరామిరెడ్డి. అయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి.. ఇతర పార్టీ నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి. పార్టీకి ఎలాంటి కష్టం వచ్చిన సుబ్బిరామిరెడ్డి దగ్గర ఉండి సాయం చేస్తుంటాడు.

అందుకే గెలుపు ఓటమిలతో ఎలాంటి సంబంధం లేకుండా ఆయనకంటూ ఓ పదవి ఉండేలా రాజ్య‌స‌భలో చైర్ వేసింది కాంగ్రెస్ హైక‌మాండ్. రాజకీయాల్లో సుబ్బిరామిరెడ్డికి ఆ స్థాయిలో పరిచయాలు ఉండటమే కాదు.. ఆ పరిచయాలను మెయింటైన్ చేయ‌టంలో సుబ్బిరామిరెడ్డి దిట్ట‌. వ్యాపార‌,సినీ,రాజ‌కీయ..ఇలా అన్నిరంగాల్లో సుబ్బిరామి రెడ్డికి ఆప్తులు ఉన్నారు. అయితే.. గత ఎన్నికల నుండి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పెద్దగా బాగాలేదు. ఈ పరిస్థితి బాగుపడేలా కూడా కనిపించడం లేదు. అందుక‌ని పార్టీ మారే ఆలోచనలో ఉన్నాడట సుబ్బిరామి రెడ్డి. ఆయ‌న‌కు వైఎస్ తో ఉన్న సాన్నిహిత్యం కార‌ణంగా వైసీపీలో చేరాలని భావిస్తున్నట్లు.. ఇప్ప‌టికే జ‌గ‌న్ స‌న్నిహితుల‌తో చ‌ర్చ‌లు ముగిశాయ‌ని పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి.

దీనిపై సుబ్బిరామిరెడ్డి అనుచ‌రులు మాత్రం ఫైర్ అవుతున్నారు. సుబ్బిరామిరెడ్డి పదువుల కోసం వెళ్లే వ్యక్తి కాదని.. పార్టీ మారాల్సిన అవసరం అయనకు లేదని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడే ప్ర‌స‌క్తే లేద‌ని సుబ్బిరామిరెడ్డి అనుచ‌రులు గట్టిగా చెప్తున్నారు. మరో వైపు వచ్చే ఎన్నికల నాటికి సుబ్బిరామిరెడ్డి ఖచ్చితంగా వైసీపీలోకి వస్తారని.. ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రు కాంగ్రెస్ నాయలులు జగన్ గూటికి చేరేందుకు రెడీగా ఉన్నారని చెప్తున్నారు. అయితే ఇదే విషయం పై సుబ్బిరామి రెడ్డి మాత్రం వైసీపీలో చేరబోనని.. అంటున్నారు.. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పాలేం.. కాబట్టి సుబ్బిరామి రెడ్డి ఇప్పుడు వైసీపీ లో చేరకపోయిన.. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీలో చేరే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి సుబ్బిరామి రెడ్డి కాంగ్రెస్ లో ఉంటారో లేక.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మారుతారో.. చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -