Saturday, June 1, 2024
- Advertisement -

గేర్ మార్చిన చంద్రబాబు!

- Advertisement -

అమరావతి రాజధాని నిర్మాణంలో జరిగిన అక్రమాల నేపథ్యంలో ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబు అరెస్ట్ జరుగుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన గేర్ మర్చారు. వీలైనంత త్వరగా అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ అరెస్ట్ తప్పనిసరి అయిన పరిస్థితుల్లోనే అంతకంటే ముందే టీడీపీ అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నారు. ఇందుకోసం పక్కా వ్యూహారచనతో మముందుకెళ్తున్నారు.

అభ్యర్థుల ఎంపికలో అంతా తానై వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. ఇందులో గ‌తానికంటే భిన్నంగా చంద్రబాబు ముందుకెళ్తున్నారు. చివరి నిమిషం వరకు సస్పెన్స్ ఉంచకుండా ఈసారి ముందుగానే అభ్యర్ధులను ప్రకటించేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి రికమెండేషన్ చేయవద్దని స్వయంగా చంద్రబాబే నేతలకు చెబుతున్నారని సమాచారం.

ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం23 స్థానాలకు పరిమితమైంది. అయితే ఇందులో నుండి 5 గురు వైసీపీకి మద్దతుగా నిలవగా ప్రస్తుతం 18 మంది మిగిలిపోయారు. ఇక సిట్టింగ్‌లకు ఇప్పటికే టికెట్ కన్ఫామ్ చేయగా వైసీపీ నుండి టీడీపీకి మద్దతిచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనున్నారు బాబు. ఇక మిగితా స్థానాల్లో క్షుణ్ణంగా క్షేత్రస్ధాయిలో పరిశీలించాకే ఓకే చేయనున్నారట బాబు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి అభ్యర్ధుల‌ను ఖరారు చేయడం జిల్లాల పర్యటన సందర్భంగా అభ్యర్థులను అప్పటికప్పుడే ప్రకటించడం ద్వారా కార్యకర్తల్లో జోష్ నింపవచ్చని బాబు భావిస్తున్నారు.

వీలైనంత త్వర‌గా అభ్యర్ధుల ఎంపిక‌ను పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు. కొన్ని స్థానాల్లో ఒక సీటుకు ఒకే అభ్యర్థి ఉండగా మరికొన్ని స్థానాల్లో ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్ధులు పోటీ ప‌డుతున్నారు. ఈ నేపథ్యంలో ఆశావాహులు సీనియర్ నేతలతో పైరవీలు చేస్తుండగా వాటికి పూర్తిగా చెక్ పెట్టారట బాబు. తాను చేయించిన సర్వేల ఆధారంగానే అభ్యర్ధుల ఎంపిక జరుగుతుందని ఎవరు తన వద్దకు పైరవీ కోసం రావొద్దని చెబుతున్నారట. చంద్రబాబు వ్యూహం ఇప్పటివరకు బాగానే ఉన్నా ఒకవేళ సీటు దొరకని వారు తిరుగుబాటు జెండా ఎగురవేస్తే టీడీపీకి మాత్రం ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -