Saturday, May 18, 2024
- Advertisement -

వైకాపాలో టిడిపి కోవర్ట్‌ నేతను పట్టేసిన జగన్…. వేటేనా?

- Advertisement -

చంద్రబాబు రాజకీయాలల గురించి కొత్తగా చెప్పేది ఏముంది? ప్రజారాజ్యం పార్టీలో పరకాల ప్రభాకర్‌ని ఎవరు చేర్పించారో…….ఆ తర్వాత ఎల్లీ మీడియాతో కలిసి టిడిపి కోవర్ట్‌గా పనిచేసిన పరకాల ప్రభాకర్ చిరంజీవి పార్టీకి ఏ స్థాయిలో నష్టం చేశాడో స్వయంగా పవన్ కళ్యాణే వివరించి చెప్పాడు. ఇప్పుడు అదే రాజకీయం వైకాపా విషయంలోనూ చేస్తున్నాడు చంద్రబాబు. వైకాపా తరపున విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జలీల్ ఖాన్ టిడిపిలో చేరిన వెంటనే 2014 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి వైకాపా చేతిలో ఓడిపోయిన వెల్లంపల్లి శ్రీనివాస్ వైకాపాలో చేరారు.

జలీల్ ఖాన్‌ని టిడిపిలో చేర్చుకుని తనకు చంద్రబాబు తీవ్రస్థాయిలో ద్రోహం చేశాడని అప్పట్లో చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేశాడు వెల్లంపల్లి శ్రీనివాస్. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా కూడా గెలిచిన ఈ నాయకుడి గురించిన షాకింగ్ నిజాలు ఇప్పుడు జగన్‌కి తెలిశాయి. వెల్లంపల్లి శ్రీనివాస్‌పై అనుమానంతో ఈ నాయకుడి గురించి ఎంక్వైరీ చేయమని విజయసాయికి పురమాయించాడు జగన్. విజయసాయి ఎంక్వైరీలో షాకింగ్ నిజాలు తెలిశాయట. వెల్లంపల్లి శ్రీనివాస్ ఏ పార్టీలో ఉన్నప్పటికీ చంద్రబాబుకు కోవర్ట్‌గా పనిచేసే నాయకుడు అని తెలిసిపోయింది. దాంతో ఇప్పుడు మొత్తం వ్యవహారాన్ని అధ్యయనం చేసిన వైఎస్ జగన్ వైకాపా నాయకులతో కలిసి వెల్లంపల్లి శ్రీనివాస్ గురించి చర్చలు చేశాడని తెలుస్తోంది. ఆ తర్వాత వెల్లంపల్లికి కూడా పద్ధతి మార్చుకోమని సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. అలాగే వీలైనంత త్వరలో వెల్లంపల్లి శ్రీనివాస్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేయనున్నారన్న సమాచారం కూడా వైకాపా నుంచి అందుతోంది. ఈ మొత్తం వ్యవహారంతో వైకాపా నాయకులు మాత్రం జగన్ నాయకత్వాన్ని అభినందిస్తున్నారు. చిరంజీవిలాగే నిండా మునిగాక కాకుండా ముందుగానే టిడిపి కోవర్టులను, చంంద్రబాబు చెంచాలను పార్టీ నుంచి గెంటేయడం కచ్చితంగా 2019 ఎన్నికల్లో వైకాపాకు కలిసొచ్చే అంశమే అని వైకాపా నాయకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -