Friday, May 17, 2024
- Advertisement -

జీవీఎల్‌తో చ‌ర్చ‌కు సిద్ధం…సీఎం ర‌మేష్‌

- Advertisement -

ఐటీ దాడుల నేప‌థ్యంలో భాజాపా, టీడీపీ నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరింది.టీడీపీఎంపీ సీఎం ర‌మేష్‌పై ఐటీ అధికారులు సోదాలు కొన‌సాగుతున్నాయి. ఐటీ దాడుల నేప‌థ్యంలో ర‌మేష్‌పై భాజాపా ఎంపీ జీవీఎల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

దాడులు మొత్తం కేంద్ర ప్రభుత్వం డైరక్షన్‌లోనే జరుగుతున్నాయని టీడీపీ నేతలు, మంత్రులు తీవ్రస్థాయిలో కేంద్రంపై ధ్వజమెత్తారు. ఈ విమర్శలకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా సీఎం రమేష్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

సీఎం రమేష్ కు సవాల్ కు కౌంటర్ గా జీవీఎల్ మరో ట్వీట్ చేశారు. అచ్చోసిన అంబోతులు అంటూ ఘాటుగా విమర్శించారు. రమేష్.. రాష్ట్రాన్ని దోచేసిన అచ్చోసిన ఆంబోతులు ఎవరో ప్రజలకు తెలుసునంటూ మండిపడ్డారు. నేను చర్చకు రెడీ మీరు సిద్ధమా అంటూ ఎంపీ జీవీఎల్ సవాల్ విసిరారు. జీవీఎల్ స‌వాల్‌కు కౌంట‌ర్ ఇచ్చారు సీఎం ర‌మేష్‌.

రెండోరోజు ఐటీ సోదాల్లో భాగంగా డిజిటల్ లాకర్లు తెరిచేందుకు ఢిల్లీలో ఉన్న ఎంపీ సీఎం రమేష్ కు ఐటీ అధికారులు ఫోన్ చేశారు. డిజిటల్ లాకర్లు తెరిచేందుకు హైదరాబాద్ రావాలని కోరారు. ఐటీ అధికారుల ఆదేశాలతో ఎంపీ సీఎం రమేష్ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీకి పెద్ద ఎత్తున డబ్బులు తరలిపోయాయన్న వార్తల్లో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు.బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సవాల్ కు సీఎం రమేష్ స్పందించారు. జీవీఎల్ సవాల్ కు తాను రెఢీ అన్నారు. ప్లేస్,టైం చెప్తే తాను రెడీగా ఉంటానని సీఎం రమేష్ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -