చంద్రబాబుకు ఊహించని అవమానం

ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే డిల్లీ చేఉకున్న బాబు కు టీడీపీ పార్టీకి చెందిన ఎంపీలు ఘనస్వాగతం పలికారు. గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడుతో కేశినేని నాని కూడా చంద్రబాబు కు స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్ట్ చేరుకొని.. శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి ఘనస్వాగతం పలికారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి కేశినేని నాని, చంద్రబాబు మద్య చోటు చేసుకున్నా కొన్ని పరిణామాలే ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయంగా మారాయి.

గత కొంత కాలంగా చంద్రబాబు వైఖరి పై కేశినేని నాని తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో డిల్లీ ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు గౌరవప్రదంగా కేశినేని నాని నమస్కారం పెట్టిన్నప్పటికి చంద్రబాబు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరించారు. దాంతో నాని కూడా చంద్రబాబుతో మాటమాత్రం కలపకుండా దూరంగానే ఉంటూ వచ్చారు. ఇక ఆ తరువాత పుష్పగుచ్చన్ని చంద్రబాబుకు ఇచ్చే క్రమంలో గల్లా జయదేవ్ ఆ పుష్పగుచ్చన్ని నాని ద్వారా ఇవ్వాలని చూసినప్పటికి ఆయన మాత్రం ఇవ్వడానికి నిరాకరించారు.

అది కూడా కాస్త విసురుగా ” మీరే ఇవ్వండి ” అనే వైఖరితో కేశినేని నాని ప్రవర్తించడంతో.. డిల్లీ వేదికగా చంద్రబాబుకు సొంత పార్టీ నేతల ద్వారానే అవమానం జరిగిందనే కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇటీవల కేశినేని నాని కుమార్తె నిర్చితర్థానికి చంద్రబాబుతో పాటు, లోకేశ్ కూడా హాజరయ్యారు. దాంతో కేశినేని నాని చంద్రబాబు మద్య అంతరం చెరిగిపోయిందనుకే లోపే డిల్లీలో ఈ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడం.. రాజకీయ వర్గాల్లో హిట్ ను పెంచుతోంది.

Also Read

ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ కర్.. ప్రత్యేకతలివే..!

జగన్ సార్.. మీ నవరత్నాలు ఇక మారరా ?

టార్గెట్ రేవంత్ రెడ్డి.. కారణం ఆదేనా ?

Related Articles

Most Populer

Recent Posts