Saturday, April 27, 2024
- Advertisement -

కాంగ్రెస్‌ ఖాతాలో..కూటమి నిధులు!

- Advertisement -

ఎన్నికల వేళ బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ చిక్కుల్లో పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సీఎం రమేష్ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు అందజేశారు. అయితే బీజేపీకి ఒక్క రూపాయి ఇవ్వకపోగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చారు.

సీఎం రమేష్ స్థాపించిన కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సుమారు రూ. 45 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను సేకరించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి రూ. 30 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన బాండ్ల నెంబర్లు: 14402, 14412, 14414, 14416, 14418, 14420,14422, 14424, 14426, 14427, 14429, 14431, 14433, 14435, 14437, 14439, 14441, 14443, 14445, 14447, 14449, 14451, 14454, 14456, 14458, 14460, 14462, 14464, 14466, 14477 సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కర్ణాటకలో బీజేపీ ఓటమికి నిధులు సమకూర్చారు సీఎం రమేష్. అయితే తాజాగా ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే విషయంలో కాంగ్రెస్ పార్టీని మౌనంగా ఉంచడానికి ఈ గిఫ్ట్ ని సీఎం రమేష్ ద్వారా చంద్రబాబు ఇప్పించారని టాక్ నడుస్తోంది. అయితే బీజేపీ ఎంపీ కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూర్చడం చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -