Tuesday, May 21, 2024
- Advertisement -

టీడీపీ కి భవిష్యత్ లేనట్లేనా..సరైన నాయకుడు దొరకట్లేదుగా..?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ టీడీపీ పరిస్థితి అదోగతిలా తయారైంది.. చంద్రబాబు తర్వాత ఎవరు నాయకుడన్న అంశం పార్టీ కార్యకర్తల్లో అలజడి సృష్టిస్తుంది. మొదటినుంచి చంద్రబాబు నారా లోకేష్ ను టీడీపీ కి అధినేతగా చేయాలనీ ప్రయత్నించినా ఆయన అసమర్థత తో పార్టీ నాయకుల్లో, ప్రజల్లో కూడా వ్యతిరేకతను కూడగట్టుకున్నారు. కనీసం పార్టీ నేతల అభిమానాన్ని సైతం అయన చూరగొనలేదు.. దాంతో లోకేష్ వస్తే టీడీపీ భవిష్యత్ కష్టమే నని వారు వాపోతున్నారు..

ఇక లోకేష్ ని మొదటినుంచి వెనుకేసుకొస్తున్న చంద్రబాబు కు ఎన్నిబాధ్యతలు అప్పగించిన అతని అసమర్థత వల్లే కోల్పోయారని చెప్పొచ్చు.. ఇప్పటికే దొడ్డి దారిన గత ప్రభుత్వంలో మంత్రి పదవి కట్టబెట్టిన దానిని సద్వినియోగం చేసుకుని ఫాలోయింగ్ తెచ్చుకోలేకపోయారు.. అంతేకాదు మంగళగిరి లాంటి నియోజక వర్గంలో విజయం సాధించలేకపోవడానికి పూర్తిగా పార్టీ వైఫల్యం కంటే లోకేష్ వైఫల్యమే ఎక్కువగా కనిపిస్తుంది.. లేక్ష్ కాకుండా అక్కడ ఎవరిని నిలబెట్టినా యా స్థానాన్ని గెలుచుకోచ్చేవారని పార్టీ నేతలే అంటున్నారు..

ఇక ఇలాంటి సమయంలో లోకేష్ కి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ స్థితి గతులు లేకుండా పోతుందని టీడీపీ నేతలే అంటున్నారు.. మరోవైపు చంద్రబాబు వృద్ధాప్యంలోకి అడుగుపెట్టడంతో టీడీపీ కి భవిష్యత్ నాయకుడు ఎవరనేది చర్చ అవుతుంది.. పార్టీ కార్యకర్తలు ఎలాగూ లోకేష్ ను వద్దంటున్నారు కాబట్టి ఎన్టీఆర్ లాంటి సినీ హీరో ని ఎవరినైనా తీసుకొద్దామా అంటే ఎన్టీఆర్ చంద్రబాబు మాట వైన్ పరిస్థితుల్లో లేడని అందరికి తెలిసిందే.. బాలకృష్ణ సరే సరి.. దీంతో టీడీపీ భవిష్యత్ పై నీలి నీడలు కమ్ముకోవడంతో చంద్రబాబు లోకేష్ కి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా.. లేదా పార్టీ లోనే ఎవరైనా సమర్ధవంతమైన నాయకుడిని వెతుకుతారా అనేది చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -