Friday, May 17, 2024
- Advertisement -

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సీఏం కేసీఆర్ సై…? వ‌చ్చేనెల్లో అసెంబ్లీ ర‌ద్దు..?

- Advertisement -

తెలంగాణాలో ముంద‌స్తుఎన్నిక‌ల‌కు సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేర‌కు పార్టీ శ్రేణుల‌కు సీఎం సంకేతాలిచ్చారు. సెప్టెంబ‌ర్ 2న ప్రగతి నివేదన సభను ఏర్పాటు చేసి ఈ స‌భ‌ద్వారా ఎన్నిక‌ల స‌మ‌ర శంఖారావాన్ని పూరించ‌నున్నారు. ఎన్నిక‌లు ఎప్పుడైనా రావ‌చ్చు…పార్టీ శ్రేణులు, కార్య‌క‌ర్త‌లు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు.

సెప్టెంబ‌ర్ 2న ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌ద్వారా ఎన్నిక‌లకు వెల్లాల‌ని కేసీఆర్ నిర్వ‌హించారు. క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో భారీ బ‌హిరంగ స‌భ‌నునిర్వ‌హించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 1600 ఎక‌రాల్లో ఈ స‌భ‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌భ‌ద్వారా నాలున్న‌ర్ర సంవ‌త్స‌రాల్లో ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప‌లు అభి వృద్ది కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నారు.

దీనిలో భాగంగా టీఆర్ఎస్ భ‌వ‌న్‌లో పార్టీ రాష్ట్ర కమిటీ, శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆయన ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ప్రగతి నివేదన సభలో ఎన్నికల భేరీ మోగిద్దామని పార్టీ శ్రేణులకు ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎన్నికలకు డిసెంబర్ ముహూర్తంపై చర్చ జరిగింది. ఒకవేళ డిసెంబర్ లో ఎన్నికలు రావాలంటే… సెప్టెంబర్ (వచ్చే నెల)లో అసెంబ్లీ రద్దు కావాల్సి ఉంటుంది.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు రాజీవ్ శర్మ ఢిల్లీలో మకాం వేసి, ముందస్తు ఎన్నికలపై చర్చలు జరుపుతున్నారు. నిన్న ఆయన కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసాతో భేటీ అయిన విషయం తెలిసిందే.ఇదే స‌మ‌యంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ వెల్తున్నారు.

ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌లో వ‌రాల జ‌ల్లులు కురిపించ‌నున్నారు కేసీఆర్‌. ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ప్రస్తుతం 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో అర్చకులకు నేరుగా వేతనాలు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేస్తారు. అర్చ‌కుల వ‌యోపిర‌మితి 58 నుంచి 65కు పెంపు.

రాష్ట్రంలోని 29 మినీ గురుకులాల ఉద్యోగులకు వేతనాలు పెంపు. హెచ్ఎం, వార్డెన్‌కు రూ.5వేల నుంచి రూ.21 వేల వరకు పెంపు. సీఆర్టీలకు రూ.4వేల నుంచి రూ.15 వేల వరకు పెంపు. పీఈటీలకు రూ.4వేల నుంచి రూ.11వేల వరకు పెంపు. అకౌంటెంట్‌కు రూ.3500 నుంచి రూ.10వేల వరకు పెంపు. ఏఎన్ఎంలకు రూ.4వేల నుంచి రూ.9వేల వరకు పెంపు. వంటమనిషి, ఆయా, హెల్పర్, స్వీపర్, వాచ్‌మెన్‌లకు రూ.2500 నుంచి రూ.7500 వరకు పెంపు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -