ఎట్టకేలకు మునుగోడు ఉపఎన్నిక సమరం తుది అంఖానికి చేరుకుంది. నవంబర్ 3న పోలింగ్ జరుగుతుండగా.. నవంబర్ 1న ప్రచారానికి తెర పడింది. ఇక చివరి రోజు ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తించాయి. ప్రచారంలో భాగంగా టిఆర్‌ఎస్, బిజెపి మద్య కొంత ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంది. పలివెలలో జరిగిన చివరి రోజు ప్రచారంలో ఇరు పార్టీల చెందిన వారు ఎదురుపడడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బిజెపి పార్టీకి చెందిన ఈటెల రాజేందర్ కాన్వాయ్ పై టిఆర్‌ఎస్ కార్యకర్తలు రాళ్ళు రువ్వడంతో పాటు కర్రలతో దాడులకు పాల్పడినట్లు బిజెపి శ్రేణులు చెబుతున్నారు. టిఆర్‌ఎస్ ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతోందంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. .
పక్కా పథకం ప్రకారమే దాడులకు పాల్పడ్డారని, ఇటీవల చుండూరు లో కేసిఆర్ ప్రసంగం కూడా దాడులను ప్రేరేపించే విధంగా ఉందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఈ దాడులపై టిఆర్‌ఎస్ మరో విధంగా స్పందిస్తోంది. బీజేపీ నేతలు వారిపై వారే దాడులు చేసుకొని కుట్రలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. కేవలం సానుభూతి కోసమే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చారు. మరి ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇంతకీ దాడులు చేసిందేవరు అనేది మాత్రం ప్రశ్నార్థకమే. ఇక గతంలో ఏ ఉపఎన్నికకు లేనంత పోలిటికల్ హిట్ మునుగోడు బైపోల్ చుట్టూ ఆవహించింది. మునుగోడు ఉప ఎన్నికలో గెలవడం టిఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వంటి మూడు పార్టీలకు ముఖ్యమైన నేపథ్యంలో ముంగోడు ఓటర్ ఏ పార్టీ వైపు చూస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి
కాంగ్రెస్ తో కేసిఆర్ పొత్తు.. ఇంతకీ రాహుల్ నిర్ణయం ఏంటి ?