Saturday, May 4, 2024
- Advertisement -

ఎన్నికల ఖర్చు : అక్కడ 2 లక్షలే.. ఇక్కడ 400 కోట్లు ?

- Advertisement -

ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ పార్టీలు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు ప్రణాళికలు వేస్తూ ఉంటారు రాజకీయ నేతలు. ముఖ్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు. రాజకీయ నాయకులకు అంతకు ముందు ఎప్పుడు గుర్తుకురాని ఓటర్లు.. ఎన్నికల సమయంలో గుర్తొస్తుంటారు. లెక్కకు మించి హామీలు ప్రకటించడం, విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేయడం వంటివి చేస్తూ ఓటర్లను విపరీతంగా ఆకర్షిస్తుంటారు పోలిటికల్ లీడర్స్. అయితే హామీల అమలు విషయంలో నిధులు లేవని చెప్పే నేతలు..తీర ఎన్నికలు వచ్చే సరికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. .

మరి అంతా డబ్బు ఎలా వచ్చిందంటే.. నిరభ్యంతరంగా ప్రజాధనమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా విచ్చలవిడిగా ఎన్నికల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేయడంపై లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ” రిషి సునాక్ ఎన్నికల కోసం కేవలం రూ. 2 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారని,. కానీ మనదేశంలో కేవలం అలాకాదని జయప్రకాష్ నారాయణ్ అన్నారు.

ఒక్క మునుగోడు ఉపఎన్నికకే మూడు ప్రధాన పార్టీలు కలిసి దాదాపుగా రూ.400 కోట్లు ఖర్చు పెడుతున్నాయని జేపీ చెప్పుకొచ్చారు. మన దేశంలో ఎన్నికలంటే టి20 మ్యాచ్ లలగా తరయ్యాయని.. ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యానికి తీరని నష్టం వాటిల్లుతుందని జయప్రకాష్ నారాయణ్ చెప్పుకొచ్చారు. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ లోక్ సత్తా పార్టీని మళ్ళీ బరిలో నిలిపేందుకు జేపీ సిద్దమౌతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి జయప్రకాష్ నారాయణ్ ఈసారైనా తాను కోరుకుంటున్న మార్పు ప్రజల్లో చూస్తారో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

కే‌సి‌ఆర్ స్కెచ్ గీస్తే.. అంతే మరి !

కుప్పంలో అరాచకం ఎవరిది.. !

హిందుత్వ రాజకీయం.. మోడీకి చెక్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -