Monday, April 29, 2024
- Advertisement -

వాలెంటిర్ల పై మరో బరువు పెడుతోన్న జగన్.. మోయగలరా ?

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత వాలెంటరీ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఎక్కడ లేని విధంగా వాలెంటరీ వ్యవస్థను ప్రవేశ పెట్టి ప్రభుత్వాన్ని ప్రజలకు చాలా దగ్గర చేశారు. దాంతో దేశ వ్యాప్తంగా ఈ వాలెంటరీ వ్యవస్థపై ప్రశంశలు కురిశాయి. ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు అందేలా చూడడం, ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా పని చేయడం వాలెంటర్ల ప్రధాన భాద్యత. అయితే వాలెంటిర్లను కేవలం ప్రభుత్వ పనులలో మాత్రమే కాకుండా.. పార్టీ కార్యకలాపాల్లో కూడా వైస్ జగన్ వాడుకుంటున్నారనే విమర్శలు మొదటి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి.

ఇక సచివాలయాలలో ప్రజలకు సంబంధించిన వివిద పనులు ఒక్క వాలెంటరీ ద్వారానే జరుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి వాలెంటరీ ద్వారా ఇన్ని పనులు జరుగుతున్న వారి ఉద్యోగానికి గ్యారెంటీ లేకపోవడం గమనార్హం. వాలెంటరీ అంటే స్వచ్చందంగా పని చేయాలని.. కానీ ప్రభుత్వం గౌరవప్రధంగా 5 వేలు వేతనం ఇస్తోందని జగన్ చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు. ఇంకా వాలెంటర్లకు మింగుడు పడని విషయం ఏమిటంటే.. వేతనం పెంచేది లేదని తెగేసి చెప్పారు కూడా. వేతనం పెంపుకు సంబంధించి వాలెంటర్లు దర్నలు చేసిన ఫలితం మాత్రం శూన్యం.

వాలెంటర్లపై లెక్కకు మించి భారం పెడుతున్నారని విమర్శలు వచ్చినప్పటికి జగన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక తాజాగా మరో భారాన్ని వాలెంటర్లపై మోపింది జగన్ సర్కార్. రైతు పండించిన ధాన్యం సేకరణ మొదలుకొని.. మిల్లుకు చేర్చే వరకు చేయవలసిన అన్నీ పనులను వాలెంటర్ల భుజాన వేసింది జగన్ సర్కార్. ఇందుకోసం వాలెంటర్లకు అదనంగా రూ.1500 రూపాయలు చెల్లించనుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన అన్నీ చర్యలు కూడా పూర్తైనట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరి ప్రభుత్వ కార్యకలాపాలలో చాలా కీలకంగా మారిన వాలెంటిర్లపై రాబోయే రోజుల్లో జగన్ సర్కార్ ఇంకెంత భారం మోపుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

టీడీపీ, బీజేపీ లను పవన్ కలుపుతారా ? జనసేనాని ఏం చేయబోతున్నాడు ?

కాపులకు పవన్ అన్యాయం చేస్తున్నారా.. ?

కే‌సి‌ఆర్ స్కెచ్ గీస్తే.. అంతే మరి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -