Saturday, May 18, 2024
- Advertisement -

వేడెక్కిన విజ‌య‌వాడ రాజ‌కీయం….జగన్ నిర్ణయంతో రాధా విస్మయం….

- Advertisement -
విజ‌య‌వాడ వైసీపీ  రాజ‌కీయాలు వేడెక్కాయి. జ‌గ‌న్ తీసుకున్న కొత్త నిర్ణ‌యంతో ఆపార్టీ నేత వంగ‌వీటి రాధాకృష్ణ తీవ్ర అసంతృప్తికి లోన‌య్యారు.  వైసీపీ కి చెందిన ఇద్ద‌రునేత‌లు వంగ‌వీటి, గౌత‌మ్ రెడ్డిల మ‌ధ్య ఇటీ వ‌ల వివాదం నెల‌కొన్న సంగ‌తి తెల‌సిందె. అవి స‌ద్దుమ‌నుగ‌క‌పోగా ఇప్పుడు జ‌గ‌న్ నిర్ణ‌యంతో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో వంగ‌వీటి రాధ తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌యిన‌ట్లు తెలుస్తోంది.
కొద్దిరోజుల క్రితం న తండ్రి రంగాపై గౌతంరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రమంలో… ఇద్దరి మధ్య వార్ స్టార్ట్ మొద‌ల‌య్యింది.  ఈ నేపథ్యంలో, గౌతమ్ రెడ్డిపై పార్టీ అధిష్ఠానం సస్పెన్షన్ వేటు కూడా వేసింది. అయినప్పటికీ గౌతమ్ రెడ్డి వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో, గౌతమ్ రెడ్డిని జగన్ బంధువు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి విజయవాడలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలసి దిగిన ఫొటో వైరల్ గా మారింది.
మరోవైపు గౌతమ్ రెడ్డి అనుచరుడైన ఒక వ్యక్తికి డివిజన్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. తాను సూచించిన మైనార్టీ నేతకు కాకుండా, గౌతమ్ రెడ్డి అనుచరుడికి బాధ్యతలను అప్పగించడంతో రాధా విస్మయానికి గురయ్యారు. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని రాధ జీన‌ర్ణించుకోలేక పోతున్నారు.
ఇటీవల విజయవాడకు జగన్ వెళ్లిన  సందర్భంలో కూడా జగన్, రాధాల మధ్య ఇదే విషయంపై చర్చ జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలు విజయవాడ వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -