Saturday, May 18, 2024
- Advertisement -

జ‌గ‌న్‌పై దాడి… వంగ‌వీటి రాధా ఎక్క‌డ‌..?

- Advertisement -

గ‌త గుర‌వారం వైసీపీ అధినేత‌పై దాడి జ‌రిగిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.శుక్ర‌వారం కోర్టుకు హ‌జ‌రైయ్యే నిమిత్తం పాద‌యాత్ర‌ను ముగించుకుని వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న స‌మ‌యంలో జ‌గ‌న్‌పై దాడి జ‌రిగింది.ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్న జ‌గ‌న్‌పై క‌త్తితో దాడి చేశాడు శ్రీనివాస్ అనే యువ‌కుడు.ఈ దాడిలో జ‌గ‌న్ భుజానికి చిన్న గాయం కాగా ,అక్క‌డే ప్ర‌థ‌మ చికిత్స తీసుకున్న జ‌గ‌న్ వెంట‌నే హైద‌రాబాద్ బ‌యలుదేరారు.ఇక జ‌గ‌న్‌పై దాడి గురించి అధికార ,ప్ర‌తిప‌క్షాలు క‌త్తులు దూసుకుంటున్నాయి.ఇక్క‌డి వ‌ర‌కు బాగ‌నే ఉన్న‌ప్ప‌టికి జ‌గ‌న్‌పై దాడి జ‌ర‌గడాన్ని వైసీపీ పార్టీ నేత‌లు అంద‌రు ఖండించారు,ఖండిస్తున్నారు కూడా.

ఒక్క నాయ‌కుడు త‌ప్ప‌.ఆ నాయ‌కుడు మ‌రెవ్వ‌రో కాదు,విజ‌య‌వాడ వైసీపీ నేత వంగ‌వీటి రాధా.జ‌గ‌న్‌పై దాడి జ‌రిగి ఇన్ని రోజులు కావ‌స్తున్న ఇప్ప‌టి వ‌ర‌కు వంగ‌వీటి రాధా ఒక్క మాట కూడా మాట్లాడ‌క‌పోవ‌డం విశేషం.నిన్న‌(సోమ‌వారం) విజ‌య‌వాడ కేంద్రంగా వైసీపీ పార్టీ నేత‌లంద‌రు జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడి గురించి ఏపీ ప్ర‌భుత్వంపై ప‌లు విమ‌ర్శ‌లు చేశారు.,కొడాలి నాని,జోగి ర‌మేష్‌,సామినేని ఉద‌య భాను ఇలా కృష్ణాజిల్లాకు చెందిన నాయ‌కులంద‌రు జ‌గ‌న్‌పై దాడి గురించి మాట్లాడారు.కాని వంగ‌వీటి రాధా మాత్రం క‌నీసం పేప‌ర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వ‌క‌పోవ‌డం సంచ‌లంగా మారింది.వ‌చ్చే ఎన్నిక‌ల‌లో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి పోటీ చేయ‌ల‌ని భావిస్తున్నారు వంగ‌వీటి రాధా.అయితే ఆ సీటు రాధాకు ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని చెప్పేశారు పార్టీ అధినేత జ‌గ‌న్‌.దీంతో పార్టీ మారే ఉద్దేశంలో రాధాను బుజ్జ‌గించే ప‌నులు కూడా పార్టీ పెద్ద‌గా చేయ‌లేదు.

పార్టీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి నేరుగా రాధాతో మంత‌నాలు జ‌రిపి రాధాను పార్టీ మార‌కుండా అయితే చేశారు.కాని రాధా టిక్కెట్ విష‌యంలో మాత్రం ఖ‌చ్చితంగా ఏ విష‌యం చెప్పలేద‌ని స‌మాచారం. రాధా వ‌చ్చే ఎన్నిక‌ల‌లో పార్టీ మార‌తార‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.దీనిలో భాగంగానే పార్టీ అధినేత‌పై హ‌త్య‌య‌త్నం జ‌రిగిన స్పందించ‌లేద‌ని తెలుస్తుంది.గ‌త కొంత‌కాలంగా ఆయ‌న జ‌న‌సేన‌లో చేర‌తార‌నే పుకార్లు వినిపిస్తున్నాయి.అయితే రాధా మాత్రం జ‌న‌సేన కూడా మ‌రో ప్ర‌జారాజ్యంలా అయితే త‌న‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని ఆలోచిస్తున్నార‌ట‌.ఏదీ ఏమైన‌ప్ప‌టికి జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడి గురించి పార్టీ నేత స్పందించ‌క‌పోవ‌డంపై సొంత పార్టీ నాయ‌కులే ఆయ‌న గురించి చెడుగా మాట్లాడుకోవ‌డం మొద‌లుపెట్టార‌ని స‌మాచారం.రాధా రాజ‌కీయ భ‌విష్య‌త్తు 2019 ఎన్నిక‌ల‌లో తెలిపోనుంద‌ని మాత్రం అక్ష‌ర స‌త్యం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -