Saturday, May 18, 2024
- Advertisement -

రాధాతో కొడాలి నాని కీల‌క చ‌ర్చ‌లు…

- Advertisement -

కృష్ణా జిల్లా పాలిటిక్స్‌లో రాజ‌కీయాల్లో ఆస‌క్తి ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో గుడివాడ‌ వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్తి కొడాలి నానిని ఓడించాల‌ని సీఎం చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అంద‌కే కొడాలిపై టీడీపీ త‌రుపున దేవినేని అవినాష్‌ను బ‌రిలోకి దింపారు. ఇద‌లా ఉంటే గుడివాడ వైసీపీలో అస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వంగ‌వీటి రాధ‌తో ఎమ్మెల్యే కొడాలి నాని భేటీ అవ్వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. గుడివాడలో స్థానిక ఏలూరు రోడ్డులోని ఫర్నిచర్‌ పార్క్‌లో నానిని కలిసి చర్చించారు.

టికెట్ విష‌యంలో అసంతృప్తికి గురి అయిన వంగ‌వీటి రాధ వైసీపీకి గుడ్‌బై చెప్పి… తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమ‌య్యారు. రెండు మూడు రోజుల్లో ప‌చ్చ కండువా క‌ప్పుకోనున్నారు. అయితే కొడాలి నాని భేటీ కావ‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.ఈ భేటీలో రాధాకృష్ణ వెంట ఆయనకు సన్నిహితులైన కాపు నేతలు కూడా పాల్గొన్నారు.

కొడాలి నాని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. రాధా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. దీంతో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.వచ్చే ఎన్నికల్లో కాపు ఓట్లు దక్కించుకునేందుకు కొడాలి నాని చూస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు 24 వేలకు పైగా ఉన్నాయి. వంగవీటి రాధా మద్దతుతో ఈ ఓట్లు తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.సార్వత్రిక ఎన్నికల ముందు వంగవీటితో నాని చర్చలు జరపడం కూడా చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -