Sunday, May 19, 2024
- Advertisement -

విజయవాడలో జగన్ అడుగిడిన రోజే బాబుకు షాక్…. వైకాపాలోకి యలమంచిలి

- Advertisement -

రాయలసీమ జిల్లాల కంటే కూడా గుంటూరు జిల్లాలో జగన్‌ ప్రజా సంకల్పయాత్రకు ఎక్కువ మంది ప్రజలు హాజరయ్యారు. ఇక నాయకుల చేరికలు కూడా భారీగా చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ స్పీకర్ కోడెల నియోజకవర్గంలో అయితే ఆ నియోజక వర్గ టిడిపి ఇన్‌ఛార్జ్ నాయకుడే వైకాపాలో చేరాడు. ఆ ఉక్రోషంతోనే స్పీకర్‌నన్న విషయం మర్చిపోయి మరీ స్పీకర్ స్థాయి తగ్గిస్తూ టిడిపి నాయకుడిలాగా జగన్‌పై విమర్శలు చేశాడు కోడెల. స్పీకర్ స్థాయిని దిగజారుస్తూ కోడెల చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక గుంటూరులో కంటే ఇంకా పెద్ద షాకులు టిడిపికి కృష్ణాజిల్లాలో, విజయవాడలో తగిలేలా కనిపిస్తున్నాయి. జగన్ ప్రజా సంకల్పయాత్ర విజయవాడలో అడుగిడిన రోజే విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి జగన్ సమక్షంలో వైకాపాలో చేరనున్నాడు. స్వయానా టిడిపి ఎంపి సుజనా చౌదరికి ఈ యలమంచిలి రవి దగ్గర బంధువు. ఇప్పుడు ఈ విషయమే రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది. టిడిపి అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, టిడిపి ఎంపి అయినప్పటికీ సుజనా చౌదరి మాత్రం ఓ వైపు సోనియా కార్యదర్శి అహ్మద్ పటేల్‌తోనూ…….మరోవైపు నరేంద్ర మోడీ అండ్ కోతోనూ సన్నిహిత సంబంధాలు నెరుపుతూ ఉంటాడు. సుజనా చౌదరి రాజకీయం అలా ఉంటుంది. ఇప్పుడు అదే సుజనా చౌదరి స్వయానా తనకు చాలా దగ్గర బంధువు అయిన విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకుడు అయిన యలమంచిలి రవిని వైకాపాలోకి పంపిస్తుండడంపై రాజకీయ విశ్లేషకులు పరిపరి విధాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం వ్యాపారస్తుడైన సుజనా చౌదరి అన్ని పార్టీలతోనూ, ప్రభుత్వాలతోనూ సన్నిహిత సంబంధాలే కోరుకుంటాడని……..2019లో జగన్ అధికారంలోకి రావడం ఖాయం అని సర్వేలతో పాటు, టిడిపి నాయకులు కూడా నమ్ముతున్న నేపథ్యంలోనే….ఎందుకైనా మంచిదని చెప్పి తన బంధువును వైకాపాలోకి పంపిస్తున్నాడని వ్యాఖ్యలు చేస్తున్నారు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు వైకాపాలో చేరారని చెప్పి ఎన్టీఆర్‌ని తనకు పట్టున్న సామాజికవర్గానికి, పార్టీకి దూరం చేయడానికి శతవిధాలా ప్రయత్నం చేశాడు చంద్రబాబు. అంతా కూడా లోకేష్‌కి పోటీ అవుతాడన్న భయంతోనే అన్న వ్యాఖ్యలు మాత్రం టిడిపి నాయకులే చేశారు. ఇప్పుడిక సుజనా చౌదరి విషయంలో చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -