Saturday, May 18, 2024
- Advertisement -

జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీ కండువా క‌ప్పుకున్న ప్ర‌ముఖ పారీశ్రామిక వేత్త

- Advertisement -

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో వైసీపీలోకి వ‌ల‌స‌లు ప్రారంభం అయ్యాయి. జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర కృష్ణాలో దిగ్విజ‌యంగా పూర్తి చేసుకొని ఘ‌నంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించింది. కలకుర్రు వద్ద జగన్‌కు ఘనస్వాగతం పలికారు పార్టీ కార్యకర్తలు. జ‌గ‌న్ స‌మ‌క్షంలో ప్ర‌ముఖ పారీశ్రామికి వేత్త గాదిరాజు సుబ్బరాజు వైసీపీ ఖండువా క‌ప్పుకున్నారు. జ‌గ‌న్ పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర 2000వేల కి.మీ. మైలురాయిని చేరుకుంది. ఆ చ‌రిత్రాత్మ‌క ఘ‌ట‌న‌కు గుర్తుగా మాదేపల్లిలో 40 అడుగుల పైలాన్‌ను జగన్ ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 30 రోజుల పాటు జగన్ యాత్ర సాగనుంది.

పాద‌యాత్రను మొద‌లు పెట్టిన‌ప్ప‌టినుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మైలు రాళ్ల‌ని చేర‌కుంది. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా వింటూ వారికి భ‌రోసా నిస్తూ ముందుకు క‌దులుతున్నారు జ‌గ‌న్‌. బాబు చేస్తున్న అవినీతి పాల‌న‌ను త‌ప్పు ప‌డుతూ, న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ దిగ్విజ‌యంగా పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు.

పాద‌యాత్ర ప్ర‌భావంతో పార్టీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. ఇప్ప‌టికే పాదయాత్ర చేసిన అన్ని జిల్లాల్లో బ‌ల‌మైన నాయ‌కులు పార్టీలో చేరారు. కృష్ణాజిల్లాలో వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌, య‌ల‌మంచిలి ఫ్యామిలీ వైసీపీ తీర్థం పుచ్కుకున్న‌సంగ‌తి తెలిసిందే. దీంతో పార్టీ బ‌లోపేతం అవుతుండ‌టంతోపాటు పార్టీ నాయ‌కుల్లో జోష్ పెరుగుతోంది. పాద‌యాత్ర పూర్త‌య్యోలోపు ఇంకెత మంది పార్టీలో చేరుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -