Friday, May 17, 2024
- Advertisement -

కత్తి వర్సెస్ పవన్ కళ్యాణ్, పూనం కౌర్…….. ఎవరికి లాభించిందంటే….?

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన సమస్యలు అన్నింటికంటే మహేష్ కత్తి వర్సెస్ పవన్ కళ్యాణ్-పూనం కౌర్‌ల ఇష్యూ రెండు రోజుల పాటు హంగామా చేసింది. ఈ మొత్తం వ్యవహారం ఎవరికి లాభించింది? రాజకీయంగా ఎవరికి లాభం చేకూరింది? వైఎస్ జగన్‌కా? పవన్‌కా? టిడిపి అధినేత చంద్రబాబుకా?

నిజాయితీగా చెప్పుకుంటే మాత్రం కచ్చితంగా చంద్రబాబుకే. ఎందుకంటే వ్యూహాన్ని అమలు చేసింది కూడా చంద్రబాబు అండ్ కోనే కదా. బాబు భజన మీడియా సంస్థలు మహేష్ కత్తిని హీరోని చేస్తూ …..పవన్-పూనంల ఇష్యూపై తమ స్టూడియోలలో కత్తిని కూర్చోపెట్టి గంటలు గంటలు చర్చలు నడపడంలోనే అన్ని విషయాలు అర్థమైపోతున్నాయి. మహేష్ కత్తి జగన్ మనిషి అయి ఉంటే….జగన్‌కి లాభం చేకూరే పరిస్థితే ఉంటే బాబు భజన మీడియా సంస్థలు అసలు మహేష్ కత్తిని పట్టించుకుంటాయా?

ఒక రకంగా చూసుకుంటే పచ్చ బ్యాచ్ వ్యూహం ఫలించింది. తనకు పదవీ స్వార్థం, ప్రయోజనాలు ఏమీ లేవు అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్‌……తెరవెనుక పూనం కౌర్‌లాంటి వాళ్ళకు బ్రాండ్ అంబాసిడర్ పదవులు ఇప్పించడంతో పాటు, అజ్ఙాతవాసి ఎగస్ట్రా షోల వ్యవహారాలన్నీ కలిసి పవన్‌ కూడా స్వార్థానికి, డబ్బుకు అతీతుడేమీ కాదు అన్న విషయాన్ని జనాల్లోకి పంపించడంలో పచ్చ మీడియా సక్సెస్ అయింది. ఇక పూనం కౌర్ వ్యవహారం, క్షుద్ర పూజల వ్యవహారాల పుణ్యమాని పవన్ ఇమేజ్‌పై భారీ దెబ్బపడింది. ఈ దెబ్బతో 2019లో టిడిపి-జనసేన పొత్తు వ్యవహారం విషయంలో సీట్లు డిమాండ్ చేసే పరిస్థితి పవన్‌కి లేకుండా పోయినట్టే. బిజెపితో కూడా బాబు ఆడే డ్రామాలన్నీ ఇలానే ఉంటాయి. బిజెపితో పొత్తు పుణ్యమాని బాబు లాభపడుతూ ఉంటాడు కానీ బిజెపిని మాత్రం ఎప్పటికీ ఎదగనివ్వడు. ఇప్పుడు జనసేన పార్టీని కూడా తన తోక పార్టీగా, జనసేన నాయకుడిని తన భజనసేనానిగా చేసుకునే ప్రయత్నంలో బాబు పూర్తిగా సక్సెస్ అయినట్టే. అంత వరకూ చూసుకుంటే మాత్రం బాబు సక్సెస్ అయినట్టే. అలాగే జగన్ పాదయాత్రకు అస్సలు ప్రచారం దక్కకుండా చేయడానికి కూడా పచ్చ గ్యాంగ్‌కి కత్తి భలే సాయపడ్డాడు.

కాకపోతే ఇలాంటి రాజకీయ కుట్రలు, వ్యూహాలను ప్రజలు అర్థం చేసుకుంటే మాత్రం చంద్రబాబుని ఇక ఎప్పటికీ నమ్మకపోవచ్చు. 2014ఎన్నికలకు ముందు బాబు ఇచ్చిన హామీలు…..అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రశ్నిస్తున్న ప్రజలనే తీవ్రంగా విమర్శిస్తున్న చంద్రబాబు వ్యవహారశైలితో ప్రతి విషయంలోనూ బాబును అనుమానించాల్సిన పరిస్థితి ఆంద్రప్రదేశ్ ప్రజలది. ఇప్పుడిక సోషల్ మీడియా పుణ్యమాని ఇలాంటి కుట్ర రాజకీయాలన్నీ ఆంద్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకుంటే మాత్రం చంద్రబాబు రాజకీయ జీవితానికి ఆయనే సమాధి కట్టేసుకున్నట్టే.

అన్నింటికీ మించి చంద్రబాబు వాడుకుని వదిలేసే రకం అన్న విషయం తనకు తెలియదా అన్న పవన్‌కి ఇప్పుడు ఇంకా బాగా విషయాలు అర్థమై ఉంటాయి. కాటమరాయుడు ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో తనను పొగిడిన టిడిపి భజన మీడియా అధినేతనే మహేష్ కత్తిని తన స్టూడియోలో కూర్చోపెట్టించి …..ఆ ఛానల్ చరిత్రలోనే ఎవ్వరికీ ఇవ్వనంత ప్రాధాన్యత ఇచ్చి…..గంటలు గంటలు లైవ్ ప్రోగ్రాం నడిపించిన విషయం పవన్‌కి కూడా అర్థమై ఉంటుంది. ఇంత జరిగిన తర్వాత పవన్ తీసుకోబోయే తర్వాత స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -