Thursday, April 25, 2024
- Advertisement -

ఏపీలో మళ్లీ త్రిమూర్తులు రాబోతున్నారా ?

- Advertisement -

మళ్లీ ముగ్గురు ఒక్కటవ్వబోతున్నారా… గతంలో కొత్త రాష్ట్రంలో ఒకే వేదికపై కలిసి పనిచేసిన మూడు పార్టీలు మళ్లీ కలవనున్నాయా… అప్పట్లో సీనియర్‌ స్క్రిప్టులు రాస్తే జూనియర్‌ చదివేవాడు. కాని ఇప్పుడు రాజకియాల్లోకి వచ్చిన జూనియర్‌ స్క్రిప్టులు రాస్తున్నారా.. ఎవ్వరా జూనియర్‌…?

మళ్లీ త్రిమూర్తులు ఒకే వేదికపైకి రాబోతున్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ వీళ్లు గతంలో కొత్త రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన సీఎం కావాలని, తాము ముగ్గురం ఆంధ్రప్రదేశ్‌కు మాడు స్థంభాల్లాంటి వాళ్లమని తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటామని ప్రజలను నమ్మబలికారు. అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతుల సమస్యలు గాలికొదిలేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన ఏ అంశాన్ని పూర్తి స్థాయిలో అములు చేసింది లేదు. దీంతో ఏన్నికలు దగ్గర పడటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడిందని మొత్తం కేంద్ర ప్రభుత్వంపై నెట్టేశారు.

దీంతో 2019లో జనసేన ఎన్నికల రంగంలోకి దిగింది. చంద్రబాబు, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనున్నా వారికి మాత్రం మొండి చెయ్యే ఎదురైంది. గతంలో బాబు స్క్రిప్టు పవన్‌ చదవగా.. ప్రస్తుతం పవన్‌ రాసిన స్క్రిప్టును చంద్రబాబు చదవుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. అందుకే రాష్ట్రంలో పవన్‌ చెప్పినట్లుగా బాబు నడుచుకుంటున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం జనసేన-బీజేపీ పోత్తు కొనసాగుతుండటంతో.. పవన్‌ బాబు పాట పాడుతున్నారు కాబట్టి మళ్లీ మూడు పార్టీలు ఏకం కావొచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్‌ వద్ద డబ్బులు తీసుకున్నారా ?

బీజేపీ వ్యూహాత్మక విజయం సాధించిందా..?

అప్పటి వరకు ఎందుకు ఇప్పుడు చూపించు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -