Sunday, May 19, 2024
- Advertisement -

ఈ దెబ్బ‌తో ప‌వ‌న్ , బాబుస్టాండ్ ఏంటో తేలిపోతుంది..

- Advertisement -

అవిశ్వాసతీర్మానం గురించి పవన్ కల్యాణ్ ఎందుకు ప్రస్తావించారో? వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు సవాలు విసిరారో తెలియ‌దు కానీ ఇప్పుడు మాత్రం హాట్‌టాఫిక్‌గా మారింది. రాష్ట్ర రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంది. పవన్ ప్రస్తావన ఒక విధంగా జగన్ కు అనుకూలంగానే మారిందనే చెప్పుకోవాలి. జాతీయ స్ధాయి పార్టీల అధినేతలతో తనకున్న పరిచయాలను చాటి చెప్పేందుకు జగన్ కు మంచి అవకాశం వచ్చింది. ఈదెబ్బ‌తో చంద్ర‌బాబుకు దిమ్మ‌తిరుగుతుంది.

పవన్ చెబుతున్నట్లు వైసిపి అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టాలంటే ఒక్క సభ్యుడు సరిపోవచ్చు. కానీ తీర్మానం స్పీకర్ ఆమోదం పొందాలంటే మాత్రం 54 మంది ఎంపిల మద్దతు అవసరం. ఆ మద్దతును పవన్ సేకరిస్తాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఒక వేల అలా చేయ‌లేక‌పోతే జ‌గ‌న్ 54 ఎంపీ మ‌ద్ద‌తు సేక‌రించ‌డం పెద్ద క‌ష్టం కాదు. ఒకవేళ జగన్ గనుక మద్దతు సంపాదించగలిగితే జాతీయ పార్టీల అధినేతల వద్ద జగన్ కున్న పట్టుకు నిదర్శనంగా నిలుస్తుంది.

చంద్రబాబుతో సంబంధం లేకుండానే జగన్ గనుక ఎంపిల మద్దతు సంపాదించగలిగితే రాష్ట్రంలో రాజకీయంగా చంద్రబాబుకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. రేపటి రోజున పార్లమెంటులో అవిశ్వాసతీర్మానం చర్చకు వస్తే చంద్రబాబు స్టాండ్ ఏంటో తేలిపోతుంది. ఎన్డీఏలో ఉంటూ అవిశ్వాసతీర్మానానికి చంద్రబాబు మద్దతు ఇవ్వలేరు. ఒకవేళ ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేస్తే జరగబోయేదేంటో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే ఎన్డీఏలో నుండి బయటకు రానంటున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో జనాల ముందు చంద్రబాబు దోషిగా నిలబడాల్సిందే.

పార్లమెంటులో అవిశ్వాసతీర్మానం చర్చకు వచ్చినపుడు చంద్రబాబు స్టాండ్ పై పవన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇంతకాలం చంద్రబాబుకు సమస్య వచ్చినపుడల్లా పవన్ ఆదుకుంటున్నారు. రేపటి రోజున తీర్మానం విషయంలో చంద్రబాబు నాటకాలు కంటిన్యూ చేస్తే పవన్ స్టాండ్ ఏంటనేది కూడా తేలిపోతుంది. ఒకే దెబ్బ‌తో ప‌వ‌న్‌, బాబు స్టాండ్ తేలిపోవ‌డంతోపాటు…జ‌గ‌న్ ఇమేజ్ అమాంతం పెరుగుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -