Saturday, May 18, 2024
- Advertisement -

ఎంపీల రాజీనామాతో టీడీపీపై ఒత్త‌డి పెరుగుతుంది…వైసీపీ ఎంపీ మేక‌పాటి

- Advertisement -

ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో వైసీపీ ఎంపీలు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా పోరాడుతోన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఎంపీల రాజీనామాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ నిరవధిక వాయిదా పడిన మరుక్షణమే తాము రాజీనామాలు చేస్తామని ఆ పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు.

ప్ర‌త్యేక‌హోదా, ఎంపీల‌రాజీనామాల విష‌యంలో జ‌గ‌న్‌తో చ‌ర్చించారు పార్టీ ఎంపీలు. ఇప్ప‌టికే అనేక సార్లు అవిశ్వాస తీర్మానం ఇచ్చామ‌ని దానిపై చ‌ర్చించేంత వ‌ర‌కు అవిశ్వాస తీర్మానాలు ఇస్తామ‌ని ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి వెల్ల‌డించారు. వ‌చ్చేనెల 6 న రాజీనామాలు చేస్తామ‌ని గ‌తంలో ప్ర‌క‌టించామ‌ని కాని లోపే సభ నిరవదికంగా వాయిదా పడితే.. తర్వాతి నిమిషమే స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పిస్తా మ‌న్నారు.

టీడీపీ ఎంపీలు కూడా చేస్తే..: ‘‘అసలు హోదానే వద్దన్న చంద్రబాబు ఇప్పుడు స్టాండ్‌ మార్చుకుని మాతోకలిసి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ముందుకొచ్చారు. రాజీనామాల విషయంలోనూ టీడీపీకి మా సూచన ఇదే.. వైఎస్సార్‌సీపీతోపాటే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే దేశవ్యప్తంగా చర్చ జరుగుతుంది. తద్వారా కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుంద‌న్నారు. మ‌రి టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారాల లేదా అన్న‌ది తేలాల్సిఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -