Wednesday, May 22, 2024
- Advertisement -

పరిటాల నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర….. ప్రత్యర్థులు ఎక్కడ? ఎందుకు మూగబోయారు?

- Advertisement -

ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర ఇప్పుడు అత్యంత సెన్సిటివ్ నియోజకవర్గంలోకి అడుగుపెడుతోంది. టిడిపి-వైకాపా నాయకులిద్దరూ కూడా శతృవుల్లా తలపడే పరిస్థితిని దశాబ్ధం క్రితమే చంద్రబాబు అండ్ కో క్రియేట్ చేశారు. ఆ తర్వాత నుంచీ ప్రతీ సందర్భంలోనూ పరిటాల రవి హత్యను ఆయుధంగా ఉపయోగించుకున్నారు. వైఎస్‌లపై ఫ్యాక్షనిస్టులు అన్న ముద్ద వేయడం కోసం పరిటాల రవి హత్య తర్వాత దేశమంతా తిరిగారు. పరిటాల సునీత చేత కూడా అసెంబ్లీతో సహా అన్ని వేదికలపైనా పరిటాల రవిని వైఎస్ జగనే చంపించాడు అని చెప్పి కథలు కథలుగా చెప్పించారు. ఇప్పుడు అదే పరిటాల సునీత నియోజకవర్గంలో వైఎస్ జగన్ అడుగుపెట్టాడు.

ఆ నియోజకవర్గంలో కూడా జగన్‌కి ప్రజాదరణే బలంగానే ఉందని మీడియా వార్తలు చూస్తుంటే తెలుస్తోంది. మామూలుగా అయితే ఇలాంటి సందర్భాల్లో ఆ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా కూడా కొనసాగుతున్న పరిటాల సునీత జగన్‌పై విమర్శల వర్షం కురిపించాలి. మరోసారి పరిటాల రవిని హత్య చేసింది జగనే అని చెప్పి, జగన్‌ని నరహంతుకుడు అంటూ తీవ్రస్థాయిలో ఆరోఫణలు చేయాలి. కానీ పరిటాల సునీతతో సహా టిడిపి బ్యాచ్ అందరూ సైలెంట్ అయ్యారు. ఒక్కరికి కూడా పరిటాల రవి హత్య గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం లేకుండాపోయింది. మాట్లాడలేరు కూడా. ఎందుకుంటే పరిటాల రవి హత్య గురించి ఇప్పుడు ఏం మాట్లాడినా ప్రజల ముందు కమెడియన్స్ అయ్యేది వాళ్ళే. ఎందుకంటే పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఆ రోజు పరిటాల సునీతతో సహా చంద్రబాబు, టిడిపి నాయకులు చెప్పిన జేసీ దివాకర్‌రెడ్డి ఈ రోజు టిడిపిలోనే ఉన్నాడు మరి. అందుకే 2014 ముందు వరకూ ప్రతి సందర్భంలోనూ పరిటాల హత్య గురించి ఆవేధనా స్వరంతో మాట్లాడి సెంటిమెంట్ రాజేసుకుంటూ జగన్‌కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఈ రోజు తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్ అయ్యారు.

అయితే ఇప్పుడు పరిటాల సునీతతో పాటు టిడిపి నేతల మౌనాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? పరిటాల హత్యతో జగన్‌కి ముడిపెడుతూ చేసిన ఆరోపణలన్నీ కేవలం వైఎస్‌లపైన విషం చిమ్మడం కోసం చేసిన నిందారోపణలనా? లేకపోతే జేసీ రాజకీయ బలం అవసరం కాబట్టి పదవుల కోసం భర్తను హత్య చేసిన వారిలో ప్రధాన నిందితుడిగా వాళ్ళే చెప్పిన వాళ్ళతో కూడా కలిసిపోయారనా? ఈ రెండు విషయాల్లో ఒకటి మాత్రం నిజం ఇందులో ఏ విషయం నిజమైనప్పటికీ అధికారం కోసం బాబు అండ్ కో ఏమైనా చేయగలరన్న విషయం మాత్రం కాస్త ఆలోచన ఉన్నవాళ్ళకు ఎవ్వరికైనా చాలా సులభంగా అర్తమవుతుందన్నది కూడా నిజం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -