Tuesday, May 21, 2024
- Advertisement -

జ‌గ‌న్ ఇంట‌ర్వూ ప్ర‌సారం అయ్యేది మొద‌ట‌ ఆ ఛాన‌ల్‌లోనే నంట‌…?

- Advertisement -

ఏ రాజ‌కీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటె సొంత ఇమేజ్‌తోపాటు ప‌త్రిక‌లు, ఎల‌క్ట్రానిక్‌మీడియా స‌హాకారం అనేది త‌ప్ప‌నిస‌రి. ఎందుకంటె మీడియాకు అలాంటి ప్రాధాన్య‌త ఉంది. మీడియా అనుకుంటె ప్ర‌భుత్వాల‌ను దించ‌గ‌ల‌వు, ప్ర‌భుత్వాల‌ను నిల‌బెట్ట గ‌ల‌వు. గ‌తంలో టీడీపీ అధికారంలోకి రావ‌డానికి ఈటీవి ఎలాంటి ప్రాముఖ్య‌త పోషించిందో అంద‌రికి తెలిసిందె. ఇప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు కూడా బాగా తెలిసి వ‌చ్చింది మీడియా ప్రాధాన్య‌త‌. త‌న సొంత ప‌త్రిక‌,ఛాన‌ల్‌తో అధికారంలోకి రావ‌డం అసాధ్య‌మ‌నె ఇప్పుడు మీడియా అధినేత‌ల‌తో మంచి సంబంధాల‌కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు.

2019 వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌కూడా రాష్ట్రంలో ఉన్న పార్టీ ప‌రిస్థితుల‌ను అంచ‌నావేసి అన్ని మీడియా అధినేత‌ల‌తో సంబంధాలు ఉండాల‌ని సూచించారంట‌. అవ‌స‌రం అయితె ఒక్క సాక్షిప‌త్రిక‌కు జ‌గ‌న్ ఇంట‌ర్వ ఇవ్వ‌డంతోపాటు జాతీయ మీడియాకు త‌ప్ప స్థానిక మీడియాకు ఇంట‌ర్వూలు ఇచ్చిన సంద‌ర్భాలు లేవ‌నె చెప్పాలి. స్థానిక, జాతీయ మీడియాను దూరం పెట్టొద్దని వైఎస్ జగన్మోహనరెడ్డికి ఆయన రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిశోర్ సూచించారు. పొలిటికల్ మేనేజ్మేంట్‌లో స్థానిక, జాతీయ మీడియా యాజమాన్యాలతో అనుబంధం పెంచుకోవాలని సలహా ఇచ్చార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి.

సాక్షిత‌ప్ప ఏ ఇత‌ర స్థానిక మీడియాకు జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ఇంట్వూ ఇచ్చిన దాఖ‌లాలు లేవు. పరిణామాలన్నీ సజావుగా సాగితే త్వరలో రామోజీరావు సారథ్యంలోని ‘ఈటీవీ’లో తొలుత వైఎస్ జగన్ ఇంటర్వ్యూ ప్రసారం కానుండటమే దీనికి కారణమని చెప్తున్నారు.

త్వరలో ఆయన పాదయాత్ర చేపట్టడానికి ముందు ఈ ఇంటర్వ్యూ ప్రసారం అవుతుందని సమాచారం. ఒకవేళ ‘ఈటీవీ’లో జగన్మోహనరెడ్డి ఇంటర్వ్యూ ప్రసారమైతే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న నానుడి నిజమేనని మరోసారి రూడీ అవుతుంది. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌వుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -