Thursday, May 16, 2024
- Advertisement -

నంద్యాల ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ చివిర సందేశం…..

- Advertisement -

ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. జ‌గ‌న్ , శిల్పా మోహ‌న్‌రెడ్డి ఇద్ద‌రు 13 రోజుల పాటు నంద్యాల అంతా అలుపెరుగ‌ని రోడ్‌షోలు నిర్వ‌హించారు. వ‌ర్షం వ‌చ్చినా ఎక్క‌డా త‌న ప్ర‌చార ర‌థాన్ని ఆప‌లేదు. ప్ర‌చారం చివ‌రి రోజున ఆరోగ్యం బాగాలేక‌పోయినా త‌న‌తో పాటు ప్ర‌చారం న‌ర్వ‌హించార‌ని శిల్పాకు జ‌గ‌న్ కితాబిచ్చారు కితాబిచ్చారు.

ప్ర‌చారం ముగియ‌గానె శిల్పాను జ‌గ‌న్ అలింగ‌నం చేసుకొని …శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎస్పీజీ మైదానంలోనూ, గాంధీ చౌక్‌లోనూ భారీ బహిరంగ సభలు నిర్వహించారు. తొలుత రోడ్‌షో ద్వారా ప్రచారం మొదలు పెట్టినా.. జనాభిమానం వెల్లువెత్తడంతో అది కాస్తా పాదయాత్రగా మారింది. ఎండనకా వాననకా తిరిగిన నేతలిద్దరూ ప్రచారం చివరి రోజున ప్రచార రథంపైనే ఆలింగనం చేసుకున్నపుడు చూసిన వేలాదిమంది కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

13 రోజుల పాటు చేసిన రోడ్‌షాలు,బ‌హిరంగ స‌భ‌లు స‌క్సెస్ కావ‌డంతో గెలుపు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు వైసీపీ నాయ‌కులు. ఖ‌శ్చ‌తంగా విజ‌యం మీదే అంటు శిల్పాకు ఆల్ ది బెస్ట్ అన్నా అంటూ ఆలింగ‌నం చేసుకున్న సంఘ‌ట‌న‌ను చూసి ప్ర‌జ‌లు చ‌లించిపోయారు.

చివ‌రిరోజున ప్ర‌చారంలో జ‌న‌గ్ నంద్యాల ప్ర‌జ‌ల‌కు సందేశ‌మిచ్చారు. శిల్పా మోహ‌న్‌రెడ్డిని ఓడించాల‌నె నెపంతో కుట్ర‌లు, కుతంత్రాల‌కు టీడీపీ పాల్ప‌డుతోంద‌ని.మోహ‌న్‌రెడ్డి అనే పేరుమీద 10 నామినేష‌న్లు వేయించింద‌న్నారు. ప్ర‌జ‌లంద‌రూ ఫ్యాన్ గుర్తుకే ఓటా వేసి శిల్పాను గెలిపించాల‌ని త‌న చివిరి ప్ర‌సంగంలో ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ప్ర‌చారం ముగిశాక జ‌గ‌న్ నంద్యాల‌ను వీడే స‌మ‌యంలో ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు శిల్పా బ్ర‌ద‌ర్స్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -