Saturday, May 18, 2024
- Advertisement -

సీన్ రివర్స్….. జగన్‌ని కలవడానికి 8మంది జంపింగ్ ఎమ్మెల్యేల వీరపాట్లు

- Advertisement -

ఎంతలో ఎంత మార్పో కదా…..రాజకీయాలు అంటేనే అంతేనేమో….మొన్నటి వరకూ వైకాపా ఎమ్మెల్యేలు ఎవరెవరు టిడిపి మంత్రులతో, బాబుతో, లోకేష్‌తో కలుస్తారో అని వైకాపా అగ్రనేతల్లో టెన్షన్ కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు అదే టెన్షన్ టిడిపి నేతల్లో కనిపిస్తోంది. నియోజకవర్గాల పెంపు ఆశ చూపించి పార్టీలో చేర్చుకున్నారు. కానీ ఆ అవకాశమే లేదని మోడీ చెప్పడంతో బాబుకు దిమ్మతిరిగింది. వైకాపా నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేలు అందరికీ ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు కచ్చితంగా టిక్కెట్ ఇస్తాడు అని టిడిపిలో ఉన్న నాయకులకే ఎప్పుడూ నమ్మకం ఉండదు. ఇక ఈ జంపింగ్ బ్యాచ్‌కి ఏముంటుంది? చంద్రబాబు, లోకేష్‌లతో సహా టిడిపి నాయకులు ఎవ్వరూ కూడా ఈ జంపింగ్ ఎమ్మెల్యేలను నమ్మడం లేదు అన్నది కూడా నిజం. రేపు జగన్‌ పవర్‌లోకి వెస్తే ఆ వెంటనే ఈ నాయకులందరూ వైకాపాలోకి జంప్ అవుతారని చంద్రబాబు భయం. అందుకే తన జాగ్రత్తలో తాను ఉంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలను ప్రత్యామ్నాయాలను రెడీ చేసుకుంటున్నాడు చంద్రబాబు.

ఈ విషయమే ఇప్పుడు జంపింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెంచుతోంది. దాదాపు ఎనిమిది మంది జంపింగ్ ఎమ్మెల్యేలు రీసెంట్‌గా ఓ సందర్భంలో సమావేశమయ్యారని తెలుస్తోంది. చంద్రబాబు టికెట్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదని……… ఒక వేళ టికెట్ ఇచ్చినా టిడిపి రెబెల్స్ దెబ్బకు గెలిచే అవకాశం కనిపించడం లేదని అందరూ అభిప్రాయపడ్డారు. మరీ ముఖ్యంగా రాయలసీమ నుంచి వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే 2019లో రాయలసీమలో టిడిపికి డిపాజిట్స్ కూడా దక్కే పరిస్థితిలేదని చెప్పుకొచ్చారు. స్వయంగా బాలకృష్ణనే ఓడిపోవడం ఖాయమని అభిప్రాయపడ్డాడట. సీమ నుంచి ఉన్న ఒక మైనారిటీ ఎమ్మెల్యే కూడా ప్రజల్లో టిడిపిపై, రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రాన్ని ఫణంగా పెడుతున్న బాబు వైనంపై తీవ్ర స్థాయి వ్యతిరేకత ఉందని చెప్పుకొచ్చాడట. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పినా చంద్రబాబును అస్సలు నమ్మలేమని…….అదే జగన్ మాత్రం మాట ఇస్తే తప్పడని….ఎలా అయినా జగన్‌తో మాట్లాడాలన్న నిర్ణయానికి వచ్చారట. ఆర్థిక ఇబ్బందులు, అధికారంలో ఉన్న చంద్రబాబు నుంచి వచ్చిన ఒత్తిడి వళ్ళే పార్టీ మారాల్సి వచ్చిందని, చంద్రబాబుపైన అభిమానం అన్న ప్రశ్నే లేదని జగన్‌కి వివరించాలన్న ప్రయత్నాల్లో ఉన్నారట. ఆల్రెడీ ఇవే విషయాలను విజయసాయికి కూడా చేరవేశారని తెలుస్తోంది. ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న జగన్ కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇప్పుడ ఈ జంపింగ్ ఎమ్మెల్యేలు తొందరపడుతున్నారని తెలుస్తోంది.

జగన్‌వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రం కనీసం 10మంది ఎమ్మెల్యేలు తిరిగి వైకాపాలోకి వచ్చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే జగన్ మాత్రం ఈ ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి సుముఖంగా లేడని తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన నియోజకవర్గ సమన్వయకర్తలను వదిలేసి ఈ జంపింగ్ నాయకులకు టికెట్స్ ఇచ్చే ప్రసక్తేలేదని చెప్పాడట. టికెట్స్ ఆశించకుండా పార్టీలో చేరతామంటే మాత్రం ఒకే అని…..నమ్మి వచ్చిన వాళ్ళకు అన్యాయం చేసిన చరిత్ర వైఎస్‌లకు లేదని…అలా కాకుండా టికెట్ ఇస్తేనే వస్తాం అంటే మాత్రం కుదరదని చెప్పేశాడట జగన్. కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తలకు మాట ఇచ్చి ఉన్న నేపథ్యంలో పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్ళకు అన్యాయం చేయనని చెప్పాడు జగన్. బేషరతుగా పార్టీలో చేరితే మాత్రం కచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పాడట. పొలిటికల్ సర్కిల్స్‌లో మాత్రం పార్టీ స్థాపించినప్పటి నుంచీ కూడా తనను నమ్ముకున్న నాయకులకు ఏం న్యాయం చేస్తానని చెప్పాడో…..ఆ మాటలన్నింటికీ జగన్ కట్టుబడి ఉన్నాడనే చెప్తూ ఉంటారు. ఈ విషయంలో చంద్రబాబు వ్యవహారం మాత్రం రివర్స్. అందరికీ మాటలు చెప్పడం…….చివరి నిమిషంలో బేరంలో నెగ్గినవాళ్ళకు, బిజినెస్ మెన్‌కి టికెట్స్ ఇవ్వడం బాబు నైజం. ఇప్పుడు జంపింగ్ ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయాలు చర్చించుకుంటున్నారట. చంద్రబాబు అనైతిక రాజకీయాల పుణ్యమాని రాజకీయ భవిష్యత్తుని సందిగ్ధంలో పడేసుకున్న ఈ జంపింగ్ ఎమ్మెల్యేల అడుగులు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -