Wednesday, May 15, 2024
- Advertisement -

బాబుపాల‌న అంతా దుశ్శాస‌న‌పాల‌న‌..

- Advertisement -

చంద్రబాబునాయుడు పాలనపై వైసిపి ఎంఎల్ఏ రోజా నిప్పులు చెరిగారు. 2017 సంవ‌త్స‌రం ఎండింగ్‌లో బాబుపై పంచ్ డైలాగ్‌ల‌ను సందించింది. గడచిన మూడున్నరేళ్ళుగా చంద్రబాబు పాలనలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, అవమానాలపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. ప‌రిపాల‌న‌లో మ‌హిళ‌ల‌పై అరాచాకాలు, హ‌త్యాచారాలు,దైర్జ‌న్యాలు త‌ప్ప వారికి భ‌ద్ర‌త క‌రువైంద‌ని విమ‌ర్శించారు.

మూడున్నరేళ్ళల్లో ఎంతమంది మహిళలు, విద్యార్ధినులు ఏ విధంగా నష్టపోయారో వివరించారు. తాజాగా విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి మండలం జెర్రిపోతుల గ్రామంలో ఎస్సీ మహిళను టిడిపి నేతలు బట్టలూడదీసిన ఘటనను గుర్తు చేసారు. ఆ ఘటనపై చంద్రబాబు ఇంత వరకూ ఎందుకు స్సందించలేదని నిలదీసారు.

అదే సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో మహిళలకు దక్కిన గౌరవాన్ని కూడా వివరించారు. వైఎస్ తన మంత్రివర్గంలో ఐదుగురు మహిళలకు కీలకమైన పదవులు ఇస్తే, చంద్రబాబు ఇద్దరిని మాత్రమే తీసుకున్నట్లు గుర్తు చేసారు. రాష్ట్రంలో దుశ్శాసన పాలన నడుస్తోందని తేల్చేసారు. మహిళల సదస్సు నిర్వహించినపుడు తనకు జరిగిన అవమానాన్ని గురించి ప్రస్తావించారు. పేరుకు మాత్రమే మహిళా సదస్సు నిర్వహించి ప్రతిపక్షాల్లోని మహిళా నేతలను కనీసం పిలవను కూడా పిలవలేదన్నారు. తనకు భజన చేసే బంధువులను మాత్రమే పిలుచుకుని సదస్సు నిర్వహించారని ఎద్దేవా చేసారు.

ఇప్పుడు చంద్రబాబు ఎప్పుడు తమ గ్రామాల్లోకి అడుగుపెడతారా? ఎప్పుడు నిలదీద్దామా? అని మహిళలు ఎదురుచూస్తున్నారు. పుట్టిన ప్రతి బిడ్డ పేరిట రూ.30 వేలు వేస్తానని అన్నారు.. ఇప్పటి వరకు ఏపీలో ఆడపిల్లలే పుట్టలేదా? పౌష్టికాహారం కోసం గర్భిణీలకు రూ.10 వేలు ఇస్తానని వారిని మోసం చేశారు. పేద మహిళలకు స్మార్ట్‌ ఫోన్‌లు ఇస్తానని అన్నారు. అన్యాయం జరిగిన ఐదు నిమిషాల్లో వారి ముందు వాలతానని చెప్పి మోసం చేశారు. న్యాయం చేయకపోగా అన్యాయానికి గురైన మహిళలు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళితే వారిని భయపెట్టి వెనక్కు పంపుతున్నారు. ఇప్పటి వరకు రిషితేశ్వరి కేసు ఎటూ తేలలేద‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -