Monday, May 20, 2024
- Advertisement -

అందుకోస‌మే పార్టీ మార‌డానికి సిద్ధం..

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు షాక్ ల‌మీద షాక్‌లు త‌గులుతున్నాయి. బాబు చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్తో ఆ పార్టీ కుదేల‌వుతోంది. కాకినాడ‌, నంద్యాల త‌ర్వాత ఆపార్టీ నేత‌ల్లో త‌మ భ‌విష్య‌త్తు పై ఆందోళ‌న‌, అసంతృప్తి బ‌య‌ట‌ప‌డుతోంద‌నేది తెలిసిందే.

వైసిపి అధినేత జగన్ వైఖరితో ఇప్పటికే పలువురు అసంతృప్తితో ఉన్నారని, వారు సమయంకోసం వేచి చూశారని అంటున్నారు. అలాంటి వారు ఇప్పుటికి ఇప్పుడు టిడిపిలో చేర‌క‌పోయినా భ‌విష్య‌త్తులో టీడీపీలోకి వెల్లేందుకు సిద్దంగా ఉన్నార‌ని తెలుస్తోంది. అనంతపురంలో వైసీపీ బిగ్ షాక్ త‌గిలేలా ఉంది..

జ‌గ‌న్‌కు మంచి ప‌ట్టున్న రాయ‌ల‌సీమ‌లో దెబ్బ‌కొట్టేందుకు బాబు వ్యూహాలు ఫ‌లిస్తున్నట్లు క‌నిపిస్తోంది. తాజాగా . వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే గురునాధ్‌రెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధ‌మైంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఇలాంటి వార్త‌లే వినిపించాయి.

అనంతపురం వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఆయన అనుచరులతో మరోసారి భేటీ అయ్యారని అంటున్నారు. టిడిపిలో చేరికపై అనుచరులతో చర్చిస్తున్నారని సమాచారం.

ఇప్ప‌టికే టిడిపి నేతలతో మంచి సంబంధాలు నెరపుతున్నారు గుర్నాథ్ రెడ్డి. పరిటాల కుటుంబం, జెసి కుటుంబంతోను సత్సంబంధాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం రెండువైపుల నుంచి గుర్నాథ్ రెడ్డి పై ఒత్తిడి వ‌స్తోంది. గ‌తంలో గురునాధ్‌రెడ్డి కుటుంబీకులు బీఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ పేరిట నగరం నడిబొడ్డున ఉన్న మిస్సమ్మ బంగళా స్థలాన్ని అక్రమ పద్ధతిలో ఆక్రమించుకున్నట్టు ఆరోపణలున్నాయి. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చాక మిస్సమ్మ బంగ్లాబై సిఐడి విచారణకు ఆదేశించింది.

రెండువైపులా ఒత్తిడి మరోవైపు, రాష్ట్రంలో వైసిపికి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. 2019పై ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ వైపు రాజకీయ భవితవ్యం, మరోవైపు బంగ్లాపై అధికార పార్టీ నుంచి ఒత్తిడి నేపథ్యంలో.. టిడిపిలో చేరాలని గుర్నాథ్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది.

జిల్లాలో తనదైన ముద్రవేసిన గుర్నాథ్ రెడ్డి చూపు ప్రస్తుతం టిడిపి వైపు ఉండటంతో వైసిపి నేతలు కొందరు అప్రమత్తమయ్యారు… ఆయనతో మాట్లాడుతున్నారని తెలుస్తోంది. జ‌గ‌న్‌కూడాలండ‌న్‌నుంచి రావ‌డంతో అసంతృప్తినేత‌లు టీడీపీ లోకి వెల్లకుండా రంగంలోకి దిగారు పార్టీ పెద్ద‌లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -