Friday, May 17, 2024
- Advertisement -

వైసీపీ నేత‌ల ప్ర‌శ్న‌ల‌కు ప‌వ‌న్ ద‌గ్గ‌ర స‌మాధానం ఉందా…?

- Advertisement -

రాజకీయాల్లో ఆరోపణలు సహజాతి సహజం. అర్థంపర్థం లేని ఆరోపణలు చేసినా రాజకీయాల్లో చెల్లిపోతుంది. కానీ, ఆ ఆరోపణలు చేసే క్రమంలో, చేసిన ఆరోపణల మీద నిలబడకపోవడం.. కొత్తగా మళ్ళీ మళ్ళీ ఆరోపణలు చేయడం ఇలాంటి వ‌న్నీ రాజ‌కీయాల్లో స‌హ‌జం. కాని ప‌వ‌న్ మాత్రం వీటిల్లో ఆరితేరారు.

తాజాగా జగన్ మీద కస్సుమన్నాడు. జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వెళ్లడం లేదు, జగన్ ఎందుకు తెలంగాణ నేతలను విమర్శించడం లేదు.. అంటూ పవన్ రెచ్చిపోయాడు. అసెంబ్లీ విషయంలో వైసీపీ ఇప్పటికే బోలెడన్ని సార్లు వివరణ ఇచ్చింది. పాతికమంది ఇటు ఎమ్మెల్యేలు అటువైపు వెళ్లి కూర్చున్నారు.. అది అసెంబ్లీనా? అని వైసీపీ ప్రశ్నిస్తోంది. అయితే ఫిరాయింపుదారుల విషయంలో అప్పుడూ పవన్ కల్యాణ్ స్పందించ లేదు, ఇప్పుడూ స్పందించలేదు.

తెలంగాణ నేతల కాళ్ల దగ్గరకు వెళ్లింది పవన్ కల్యాణే. తన సినిమా అజ్ఞాతవాసి ప్రీమియర్ షోల అనుమతి కోసం తనే స్వయంగా కేసీఆర్ వద్దకు వెళ్లాడు పవన్ కల్యాణ్.కేసీఆర్ పాలన గురించి తెగ ప్రశంసించాడప్పుడు. అంతచేసినా.. అజ్ఞాతవాసికి కేసీఆర్ కరుణ దక్కలేదనుకోండి. అయితే ప‌వ‌న్ చేసే ప్ర‌తీ విమ‌ర్శ‌ల‌కు చిరు టార్గెట్ అవుతున్నారు.

ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన‌ప్పుడు మీరు ఎక్క‌డున్నారంటూ వైసీపీ ప్ర‌శ్న‌లు సందిస్తోంది. ప్ర‌జారాజ్యం పార్టీ అధికారంలోకి రాకుంటే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని చెప్పిన నువ్వు ఏం చేశావ‌ని నిల‌దీస్తోంది. ప్ర‌జారాజ్యం పార్టీలో టికెట్లు అమ్ముకోలేదాని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ ప్ర‌శ్న‌ల‌కు ప‌వ‌న్ ద‌గ్గ‌ర స‌మాధానం లేద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే.

సోషియ‌ల్ మీడియాలో కూడా నెటిజ‌న్లు చిరూనే టార్గెట్ చేస్తున్నారు. చిరు, క‌వ‌న్‌ల‌ను చెడుగుడు ఆడేస్తున్నారు. ఇక వైసీపీ నుంచి ఇప్పుడు పవన్ మీద ఘాటుగానే విమర్శలు వచ్చాయి. పవన్ ప్రస్తావించిన ప్రతి అంశాన్నీ పట్టుకుని వైసీపీ నేతలు పేర్నినాని, కురసాల కన్నబాబులు కడిగేశారు. వారు పలు అంశాలను లేవెనెత్తారు. వాటికి ఎలాగూ పవన్ కౌంటర్ ఇవ్వలేడు అనుకోండి. పాపం ప‌వ‌న చేసే అర్థం ప‌ర్థంలేకుండా చేసే విమ‌ర్శ‌ల‌కు చిరు టార్గెట్ అయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -