Saturday, May 18, 2024
- Advertisement -

టీడీపీకి షాక్ !…ఏపీలో వైకాపా హవా..రిపబ్లిక్, సీ-వోటర్ సర్వే!…ఎన్ని సీట్లంటే…?

- Advertisement -

వ‌చ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్ర‌భంజ‌నం సృష్టించ‌నుంది.కేంద్రంలో ఎన్డీయే కూటమి సాధారణ మెజారిటీకి చేరువగా వస్తుందని సర్వే తెలిపింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రదర్శన మెరుగవుతుందని, ఆ కూటమి వంద సీట్లకు పైగా గెలుచుకుంటుందని తెలిపింది.

ఎన్నిక‌లు ఇప్ప‌టికిప్పుడు జ‌రిగితే రాష్ట్రంలోని 25 లోక్ సభ సీట్లలో 20 వైకాపా గెలుస్తుందని, టీడీపీకి 5 స్థానాలు లభిస్తాయని పేర్కొంది. “నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌” పేరిట తాజా అంచనాల్ని రిపబ్లిక్ – సీ వోటర్ సర్వే పేర్కొంది సంస్థ విడుదల చేసింది.

కేరళలో ఖాతా తెరవాలని భావిస్తున్న బీజేపీకి మరోసారి చుక్కెదురవుతుందని, తమ రాష్ట్రాన్ని వరదలు పీడించినప్పుడు కేంద్రం సరిగ్గా సాయపడలేదన్న ఆగ్రహం కేరళీయుల్లో ఉందని వెల్లడించింది. దేశంలో అత్యధిక లోక్ సభ సీట్లున్న యూపీలో అఖిలేష్, మాయావతిల కారణంగా బీజేపీ ఎదురుదెబ్బ తప్పదని పేర్కొంది.

2014 ఎన్నికల్లో ఏపీలో 2 లోక్ సభ స్థానాలు గెలుచుకున్న బీజేపీకి, ఈ దఫా ఒక్క సీటు కూడా దక్కదని రిపబ్లిక్, సీ-వోటర్ సర్వే పేర్కొంది. ఇక ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే, వైఎస్ఆర్ సీపీకి 41.2 శాతం ఓట్ల‌తో 20 సీట్లు, టీడీపీకి 31.2 శాతం ఓట్లుతో 5 స్థానాలు లభిస్తాయని, బీజేపీ 11.3 శాతం, కాంగ్రెస్ కు 9.3 శాతం ఓట్లు లభిస్తాయని అంచనా వేసింది. అంతేకాదు ఏపీలో జ‌రిగే అన్ని ఎన్నిక‌ల‌పై ఎన్నో సంస్థ‌లు స‌ర్వేలు చేసినా వైసీపీ విజ‌యం ఖాయం అని తెలుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -