Tuesday, May 21, 2024
- Advertisement -

యూటర్న్ తీసుకునే అలవాటు మా ఇంటావంటా లేదు…వైఎస్ జ‌గ‌న్‌

- Advertisement -

జగ్గంపేట బహిరంగసభలో కాపు రిజర్వేషన్లపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. కాపులకు యిచ్చిన హామీ నిలబెట్టుకోలేని చంద్రబాబు మోసగాడా? కాపులకు మద్దతుగా నిలబడ్డ జగన్ మోసగాడా? అని ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపు రిజర్వేషన్లకు తమ పార్టీ మద్దతు యిస్తోందని, ఈ విషయంలో సలహాలిస్తే స్వీకరిస్తానని అన్నారు. యూటర్న్ తీసుకునే అలవాటు తమ ఇంటావంటా లేదని, ఎల్లో మీడియా మద్దతు ఉందని బాబు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

ప్రతి కులాన్ని, మతాన్ని చంద్రబాబు మోసం చేశారని, ఇలా మోసం చేసే వాళ్లను, అబద్దాలు చెప్పే వాళ్ల మాటలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వలేమని తెలిసినా టీడీపీ మ్యానిఫెస్టోలో కాపు రిజర్వేషన్ల అంశం ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు, నాలుగున్నరేళ్లుగా మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఎన్నికల ముందు కాకినాడ సెజ్ భూములు వైఎస్ జగన్ ‌ భూములుగా పేర్కొన్నారన్నారు. అధికారంలోకి వస్తే ఈ భూములను రైతులకు ఇవ్వనున్నట్టు ప్రచారం చేశారని జగన్ గుర్తు చేశారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కాకినాడ సెజ్ భూములను రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తే కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నాడని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఓ మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడే నైజం చంద్రబాబునాయుడుకు ఉందన్నారు

కాపులను అణచివేస్తే తాము అండగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాపుల ఉద్యమం తీవ్రతరమైన సమయంలో కాపుల కోసం కమిషన్ వేసినట్టు చెప్పారు. కాపు కమిషన్ ఛైర్మెన్ సంతకం లేకుండానే అసెంబ్లీలోనే తీర్మానం ప్రవేశపెట్టినట్టు చెప్పారు. కాపుల రిజర్వేషన్ల విషయంలో యూ టర్న్ తీసుకొంది చంద్రబాబునాయుడు మాత్రమేనని ఆయన చెప్పారు.

కాపుల రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబునాయుడు మాదిరిగా తాను మోసం చేయలేనని తాను ప్రకటిస్తే తాను యూ టర్న్ తీసుకొన్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించారు. కానీ, కాపులకు ఐదువేల కోట్లు ఇస్తామని ప్రకటించి కేవలం 1340 కోట్లు మాత్రమే ఇచ్చారని ఆయన చెప్పారు. కానీ, కాపుల కోసం తాము 10 వేల కోట్లు ఇస్తామని జగన్ ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -