Thursday, May 9, 2024
- Advertisement -

2004 వైఎస్ మేజిక్ రిపీట్….. వైకాపాలోకి బాబు సొంత వర్గం అగ్ర నాయకులు

- Advertisement -

నందమూరి, నారా కుటుంబాల నుంచి కూడా వైకాపాలోకి నాయకుల చేరికలు ఖాయం అయ్యాయా? 2004 ఎన్నికల్లో చంద్రబాబు సొంత కులం ప్రజలు, నాయకులు కూడా తనకు మద్దతిచ్చేలా చేసుకోవడంలో విజయం సాధించిన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిలాగే వైఎస్ జగన్ కూడా విజయవంతం అవుతున్నాడా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అత్యంత దగ్గరగా పరిశీలిస్తున్నవాళ్ళు మాత్రం ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెప్తున్నారు.

తన కొడుకుతో కలిసి త్వరలోనే వైకాపాలో చేరనున్నారు పురంధేశ్వరి. ఇప్పటికే విజయసాయిరెడ్డికి టచ్‌లోకి వెళ్ళిన పురంధేశ్వరి వైకాపా అధినేతతో తన విషయం చెప్పమని చెప్పుకుంది. జగన్ కూడా ఈ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వైకాపా ముఖ్యనాయకులు చెప్తున్నారు. మరోవైపు నారా వారి సొంత కుటుంబంలోని ఒక నాయకుడు కూడా చిత్తూరు జిల్లాలో వైకాపాలో చేరడం ఖాయం అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే స్థానికంగా చంద్రబాబు సొంత కులానికి సంబంధించిన కొన్ని కుల సంఘాలు వ్యవసాయం, గ్రామ సీమలు వైఎస్ రాజశేఖరరెడ్డి కాలంలో ఉన్నట్టుగా గొప్పగా ఉండాలంటే వైఎస్ జగన్‌కి మద్దతు ఇవ్వడమే కరెక్ట్ అన్నట్టుగా తీర్మానాలు చేస్తూ ఉండడం టిడిపి నాయకులను టెన్షన్ పెడుతోంది.

2019ఎన్నికల్లో వైకాపాకు మద్దతివ్వాలని కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలు నిర్ణయం తీసుకున్నారని జాతీయ స్థాయి సర్వేల విశ్లేషణలు తేల్చేస్తున్నాయి. వైఎస్ జగన్ పార్టీకి చంద్రబాబు పార్టీకి మధ్య 2019 ఎన్నికల్లో దాదాపు పదిశాతం ఓట్ల వ్యత్యాసం ఉంటుందని జాతీయ స్థాయి సర్వే సంస్థలు తేల్చిచెప్తున్నాయి. ఈ స్థాయిలో వైకాపా ఓట్లు కొల్లగొట్టిందంటే మాత్రం టిడిపి కనీసం ప్రతిపక్ష స్థానానికి అర్హత సాధించడం కూడా కష్టమే అవుతుంది అని విశ్లేషకులు చెప్తున్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ మూడ్ కూడా జగన్ గెలిచేసినట్టే అనే స్థాయిలో ఉండడం చంద్రబాబుకి 2019 ఎన్నికలు అత్యంత కఠిన పరీక్షగా మారాయనడంలో సందేహం లేదు. 2014ఎన్నికల్లో బాబు అబద్ధపు హామీలు, మోసాలు చూసిన ఓటర్లు ఇక ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పచ్చ మీడియాతో కలిసి చంద్రబాబు చేయబోయే పొలిటికల్ మేనేజ్‌మెంట్, బాబు మార్క్ వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతుండడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -